ఏఎన్నార్ అవార్డు క‌న్నీళ్లు పెట్టించేసింది

ఏఎన్నార్ అవార్డు క‌న్నీళ్లు పెట్టించేసింది

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు స్మార‌కార్థం ఏర్పాటు చేసిన ఏఎన్నార్ జాతీయ అవార్డు వేడుక‌ను ఏటా అక్కినేని కుటుంబం ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తోందో తెలిసిందే. ఈసారి కూడా ఈ వేడుక‌ను వైభ‌వంగా నిర్వ‌హించారు.

ఈ వేడుకను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే నాగార్జున త‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ మ‌రోసారి వారెవా అనిపించేలా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాడు. ఈ కార్య‌క్ర‌మంలో చాలా వ‌ర‌కు స‌ర‌దాగా క‌నిపించిన నాగ్.. తండ్రిని గుర్తు చేసుకుంటున్న‌పుడు మాత్రం ఉద్వేగానికి గుర‌య్యాడు. త‌డి క‌ళ్ల‌తో.. గ‌ద్గ‌ద స్వ‌రంతో తండ్రి గురించి.. ఆయ‌న పేరిట ఇస్తున్న అవార్డు గురించి మాట్లాడాడు నాగ్.

సినిమా నాకు సర్వస్వం. అదే నాకు ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ అవార్డు సృష్టించబడింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారిని ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతో సత్కరించాలనుకున్నాం’ అని ఏఎన్నార్ త‌న పేరిట నెల‌కొల్పిన అవార్డు గురించి చెప్పార‌ని.. ఆయన సంకల్పమే ఈ రోజు త‌మ‌ను న‌డిపిస్తోంద‌ని.. శ్రీదేవి, రేఖల‌కు ఏఎన్నార్ అవార్డు ఇవ్వాల‌ని  ఏఎన్నార్ ఎప్పుడూ చెబుతూ ఉండేవార‌ని.. ఈ రోజు ఆయ‌న ఈ వేదిక‌పైనే ఉండి వారికి అవార్డు ఇస్తున్నార‌ని భావిస్తున్నార‌ని నాగ్ ఎమోష‌న‌ల్‌గా చెప్పాడు.

మ‌రోవైపు దివంగ‌త‌ శ్రీదేవి త‌ర‌ఫున అవార్డు స్వీక‌రించిన ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు. వేదిక మీద వ‌చ్చేస‌రికే ఆయ‌న క‌న్నీళ్లు పెట్టేసుకున్నారు. అవార్డు స్వీక‌రించేట‌పుడు, ఆ త‌ర్వాత ప్ర‌సంగిస్తూ ఆయ‌న క‌న్నీటిని ఆపుకోలేక‌పోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English