చిరు స‌ల‌హా.. నాగ్ స‌ర‌స‌న రేఖ‌

చిరు స‌ల‌హా.. నాగ్ స‌ర‌స‌న రేఖ‌

బాలీవుడ్ ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్ రేఖ వ‌య‌సిప్పుడు 65 ఏళ్లు. ఐతే సౌంద‌ర్యం విష‌యంలో విప‌రీత‌మైన శ్ర‌ద్ధ చూపించే రేఖ‌ను చూస్తే ఆమెకా వ‌య‌సున్న‌ట్లు అనిపించ‌దు. మిడిలేజ్డ్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా పెట్టొచ్చ‌ని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అంటున్నాడు.

అక్కినేని నాగార్జున స‌ర‌స‌న ఆమెను హీరోయిన్‌గా తీసుకోమ‌ని చిరు స‌ల‌హా ఇవ్వ‌డం విశేషం. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జాతీయ అవార్డు స్వీక‌రించ‌డం కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమెతో వేదిక మీద స‌ర‌దాగా ముచ్చ‌టిస్తూ చిరు ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఈ వేడుక‌లో రేఖ‌తో పాటు శ్రీదేవికి కూడా ఈ పుర‌స్కారం అందించారు.

ఈ సంద‌ర్భంగా నాగ్ మాట్లాడుతూ.. అదృష్టం కొద్దీ శ్రీదేవితో నాలుగు సినిమాలు చేశాన‌ని.. అలాగే రేఖ‌తో కూడా న‌టించే అవ‌కాశం ఇస్తే సంతోషిస్తాన‌ని అన్నాడు. దీనికి రేఖ బ‌దులిస్తూ.. నేను మీకు గ్రేట్ గ్రాండ్ మ‌ద‌ర్‌గా క‌నిపిస్తాలెండి అంది.

ఇంతలో చిరు మైక్ అందుకుని.. మీరు నాగార్జున‌కు గ్రేట్ గ్రాండ్ మ‌ద‌ర్‌గా న‌టించ‌డ‌మేంటి.. అందుకు నేనొప్పుకోను.. ఆయ‌న ప‌క్క‌న మీరు క‌థానాయిక‌గానే చేయండి.. నాగ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తాడు.. అందులో తండ్రి పాత్ర‌కు జోడీగా మీరు న‌టిస్తే బాగుంటుంద‌ని అన‌గా.. ఈ వ్యాఖ్య‌ల‌కు ఆడిటోరియం హోరెత్తింది. ఇంత‌కీ ఈ వ‌య‌సులో కూడా ఇలా అందం ఎలా మెయింటైన్ చేస్తున్నార‌ని నాగ్ అడిగితే.. మీరెలా చేస్తున్నారో నేనూ అలాగే అంటూ చ‌మ‌త్క‌రించింది రేఖ‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English