ఆ సినిమా ఏడువేల కోట్లు కొల్లగొట్టింది

ఆ సినిమా ఏడువేల కోట్లు కొల్లగొట్టింది

ఏ అవతార్ సినిమానో.. ఏ ఎవెంజర్స్ మూవీనో వందలు వేల కోట్ల వసూళ్లు సాధిస్తే ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి విజువల్ వండర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజే వేరు. కానీ ‘జోకర్’ లాంటి సీరియస్ ఫిలిం వరల్డ్ వైడ్ బిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.7 వేల కోట్లకు పైనే వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. గత నెలలో రిలీజైన ఈ సినిమాా తాజాగా బిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును అందుకుని సంచలనం సృష్టించింది.

వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన చిత్రాల్లో బిలియన్ మార్కును అందుకున్న ఆరో చిత్రమిది. జోక్విన్ ఫోనిక్స్ అద్భుత అభినయానికి ఫిదా అయిపోయిన ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ‘జోకర్’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఇండియాలో కూడా ఈ సినిమా అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది రూ.70 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఇండియాలో ఈ స్థాయి వసూళ్లు వస్తాయని ఎవరూ అనుకోలేదు. వివాదాస్సద చిత్రాల దర్శకుడు టాడ్ ఫిలిప్స్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. విడుదలకు ముందు ఈ సినిమా అనేక వివాదాలు రాజేసింది. సినిమా మరీ హింసాత్మకంగా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమా విడుదలకు అనుమతించవద్దని కూడా డిమాండ్లు వినిపించాయి.

ఐతే వివాదాలన్నింటినీ అధిగమించిన సినిమా భారీ స్థాయిలో విడుదలై అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. సినిమాలో జోక్విన్ ఫోనిక్స్ నట కౌశలం గురించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. ప్రపంచ సినీ చరిత్రలోనే బెస్ట్ పెర్ఫామెన్సెస్‌లో ఒకటిగా దాన్ని పేర్కొన్నారు. ఈ సినిమాకు అతను ఆస్కార్ అవార్డు అందుకోవడం కూడా ఖాయమంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English