ఈ వీక్ బాక్సాఫీస్ లీడర్ ఎవరు?

ఈ వీక్ బాక్సాఫీస్ లీడర్ ఎవరు?

సినిమాలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఊపు కనిపించడం లేదు. ఫిబ్రవరి మార్చి నెలల్లో మాదిరి దారుణమైన వసూళ్లతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబు చెప్పినట్లుగా ఆక్యుపెన్సీ పర్సంటేజ్ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ఏ తెలుగు సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది.

ఈ నెల రోజుల్లో అరడజనుకు పైగా తెలుగు సినిమాలొచ్చాయి కానీ.. ఏదీ నిలబడలేదు. ఈ వారం సందీప్ కిషన్ సినిమా ‘తెనాలి రామకృష్ణ’ రిలీజైంది. ఈ సినిమా తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. మాస్ సెంటర్లలో ఓ మాదిరిగా ఆడుతోంది కానీ.. మిగతా చోట్ల స్పందన ఆశించిన స్థాయిలో లేదు. వీకెండ్లో కూడా పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.

‘తెనాలి రామకృష్ణ’కు పోటీగా రెండు తమిళ సినిమాలు ఈ వీకెండ్లో థియేటర్లలోకి దిగాయి. అందులో ఒకటి ‘యాక్షన్’ కాగా.. మరొకటి ‘విజయ్ సేతుపతి’. విశాల్, తమన్నా జంటగా నటించిన ‘యాక్షన్’ సినిమాకు ఏమంత మంచి టాక్ రాలేదు. యాక్షన్ ఘట్టాలు మాత్రమే బాగున్నాయంటున్నారు. యాక్షన్ సినిమా లవర్స్ సినిమాను బాగానే చూస్తున్నట్లున్నారు. దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ‘విజయ్ సేతుపతి’ గురించి పట్టించుకునేవాళ్లు లేరు.

విజయ్‌కి ఇక్కడ ఏమంత ఫాలోయింగ్ లేదు. పైగా సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ వారం.. గత రెండు వారాల్లో వచ్చిన సినిమాల కంటే దీపావళి కానుగా విడుదలైన కార్తి సినిమా ‘ఖైదీ’ ఇప్పటికీ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. దీనికి స్క్రీన్లు తగ్గాయి కానీ.. ఉన్న స్క్రీన్లలో మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. శని, ఆదివారాల్లో సెలెక్టివ్ స్క్రీన్లలో ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడే పరిస్థితి ఉండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English