నాగచైతన్య టెంప్ట్‌ అవుతున్నాడు కానీ...

నాగచైతన్య టెంప్ట్‌ అవుతున్నాడు కానీ...

నాగచైతన్య మిగతా హీరోల మాదిరిగా ఎక్కువ గ్యాప్‌ తీసుకోడు. అదే పనిగా సినిమాలు చేస్తూనే వుంటాడు. అలా చేస్తున్నపుడు అన్ని కథలు దొరకడం కష్టం కనుక కథల కోసం పర భాషా చిత్రాల మీద కూడా ఒక కన్నేసి ఉంచుతున్నాడు. అయితే నచ్చిన ప్రతి సినిమా చేసేద్దామనుకుంటాడు కానీ దానిని ముందుకి కదిలించడు. ఈలోగా వేరే స్ట్రెయిట్‌ సినిమా ఏదైనా కనిపిస్తే అటు షిఫ్ట్‌ అయిపోతాడు. చైతన్య ఇంతకుముందు బరైలీ కీ బర్ఫీ, బదాయి హో చిత్రాలని తెలుగులో రీమేక్‌ చేద్దామని అనుకున్నాడు. ఇంతలో వెంకీమామ స్క్రిప్టు రెడీ కావడంతో అటు వెళ్లిపోయాడు.

ఇప్పుడు తనకి ఆ చిత్రాలు అంత ఎక్సయిటింగ్‌గా అనిపించడం లేదు. తాజాగా అతని దృష్టి 'చిచోరే'పై పడింది. క్యాంపస్‌ కామెడీ అయిన ఈ చిత్రం బాలీవుడ్‌లో నూట యాభై కోట్లకి పైగా కొల్లగొట్టింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లు కూడా మిగిలిన ముఖ్య పాత్రధారులతో కలిసిపోతారు. చైతన్యతో పాటు మిగిలిన ఆ పాత్రలన్నిటికీ మంచి నటులని వెతికి తేవాలి. తెచ్చినా కానీ 'దంగల్‌' దర్శకుడు నితేష్‌ తివారీ రేంజ్‌లో దానిని తిరిగి తెరకెక్కించే దర్శకుడెవరు? నచ్చిన ప్రతి సినిమా రీమేక్‌ చేయాలని ఆలోచిస్తున్నాడే తప్ప చైతన్య ముందుకి కదిలించడం లేదు. దీని వల్ల మిగతా హీరోలు కూడా బదాయి హో లాంటి మంచి చిత్రాల జోలికి పోవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English