సెంటిమెంటుతో పిండేసే వెంకీ మామ

సెంటిమెంటుతో పిండేసే వెంకీ మామ

వెంకటేష్‌, నాగచైతన్య కలిసి నటిస్తోన్న 'వెంకీ మామ' డిసెంబర్‌ 13న విడుదల కావడం దాదాపు ఖాయమైనట్టే. రేపో, ఎల్లుండో అధికారికంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ కూడా వచ్చేస్తున్నట్టే. ఈ చిత్రంపై అంచనాలయితే భారీగానే వున్నాయి. వెంకీ, చై కలిసి నటించడం మాత్రమే కాకుండా వెంకటేష్‌ గత చిత్రం 'ఎఫ్‌ 2' అంత పెద్ద హిట్టవడంతో ఇది కూడా అలాగే అదరగొట్టేస్తుందని అంచనాలున్నాయి. అయితే ఇది 'ఎఫ్‌ 2' మాదిరిగా కామెడీ సినిమా కాదని తెలిసింది. ఇందులోను వెంకటేష్‌ మార్కు కామెడీ వున్నా కానీ ఇది ప్రధానంగా సెంటిమెంట్‌ సినిమా అట.

ద్వితియార్థంలో గుండెలు పిండేసే సెంటిమెంట్‌ వుంటుందని విశ్వసనీయ సమాచారం. ఈ సెంటిమెంటు ఎంతగా కనక్ట్‌ అయితే వెంకీ మామకి అంత ఆదరణ దక్కుతుందట. మేనమామ, అల్లుడు కలిసి నటించిన తొలి చిత్రం ఫన్‌ బేస్డ్‌ వుంటుందని ఫాన్స్‌ ఆశిస్తారు. కానీ ఎందుకో సెంటిమెంట్‌కి ఈ హీరోలిద్దరూ పడిపోయారు. వెంకటేష్‌ కామెడీతో పాటు సెంటిమెంట్‌ కూడా అదరగొట్టేస్తారు కానీ ఎఫ్‌2 మాదిరిగా అన్ని వర్గాలని అలరించేలా వెంకీ మామ వుంటాడా లేదా అన్నదే క్వశ్చన్‌ ఇప్పుడు. ఈ చిత్రంపై సరయిన అంచనాలు రేకెత్తించడానికి గాను ట్రెయిలర్‌లో సెంటిమెంట్‌ పార్ట్‌ని కూడా హైలైట్‌ చేసి చూపించబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English