రకుల్‌ సినిమాని చీల్చి చెండాడుతున్నారు

రకుల్‌ సినిమాని చీల్చి చెండాడుతున్నారు

పాపం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఏదీ కలిసి రావడం లేదు. మన్మథుడు 2లో నాగార్జునతో రొమాన్స్‌ చేస్తే తెలుగు ప్రేక్షకులు తిప్పి కొట్టారు. హిందీలో 'మర్జావా' అనే సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తే ఇప్పుడా చిత్రాన్ని విమర్శకులు చీల్చి చెండాడుతున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ లాంటి పేరున్న హీరోలు నటించిన చిత్రమే అయినా కానీ దీనికి వాతలు తప్పడం లేదు. ఈ చిత్రంలో రకుల్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటించకపోయినా కానీ ఆమె ఖాతాలో అయితే మరో ఫ్లాప్‌ రికార్డ్‌ కాక తప్పలేదు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బౌన్స్‌బ్యాక్‌ అవ్వాలని పలు భాషలలో ప్రయత్నిస్తున్నా కానీ ఎక్కడా కాలం కలిసి రావడం లేదు. ఫిజికల్‌గా తనని తాను ఫిట్‌గా వుంచుకోవడానికి ఎంత కష్టపడుతుందనేది రకుల్‌ రోజూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తోంది. అయితే మంచి కథలు ఎంచుకోవడానికి కనీసం జిమ్‌లో గడిపే సమయాన్ని అయినా కేటాయించాల్సి వుంది. లేదంటే సమంత తర్వాత తెలుగు చిత్ర సీమలో టాప్‌ హీరోయిన్‌ అవుతుందని అనుకున్న రకుల్‌ చాలా వేగంగా అవకాశాలు రాని పొజిషన్‌కి చేరుకుంది.

ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు కూడా ఆమెని మరింత కిందకి నెడుతున్నాయే తప్ప నిలదొక్కుకునే ఛాన్స్‌ కూడా ఇవ్వట్లేదు. శంకర్‌, కమల్‌హాసన్‌తో 'ఇండియన్‌ 2' చేస్తోన్న రకుల్‌ ప్రీత్‌ ఆ చిత్రమైనా తిరిగి తనని బిజీ చేస్తుందనే ఆశ పెట్టుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English