సినిమాని నిలువునా ముంచేసాయి

సినిమాని నిలువునా ముంచేసాయి

అనుకున్నంతా అయింది. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి 'ఓవర్‌ ది టాప్‌' ప్లాట్‌ఫామ్స్‌ ఇండియాలోకి ఎంటర్‌ అయినపుడే సినిమా బిజినెస్‌కి ఇది చేటు చేస్తుందని విశ్లేషకులు గెస్‌ చేసారు. స్ట్రీమింగ్‌ ద్వారా అదనపు ఆదాయం వస్తోందని నిర్మాతలు ఆనందించేలోగానే దాని వల్ల ఎంత నష్టం వుందనేది తెలుసుకున్నారు. ఫలానా సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌ లేదా నెట్‌ఫ్లిక్స్‌ కొనేసిందంటే థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లో సదరు చిత్రం టీవీలో 4కె రిజల్యూషన్‌తో వచ్చేస్తుందని జనం ఫిక్స్‌ అయిపోతున్నారు.

అందుకే తప్పనిసరిగా చూడాలనుకునే సినిమా అయితేనో, లేదా చాలా బాగుందంటే టీవీలో వచ్చేవరకు వెయిట్‌ చేయలేకనో తప్ప థియేటర్లకి వెళ్లడం లేదు. ఈ ఓటీటీ చేస్తోన్న నష్టాన్ని సురేష్‌బాబు అడ్రస్‌ చేసారు. తెలుగు రాష్ట్రాలలో నాలుగు వందలకి పైగా థియేటర్లు నడిపే సురేష్‌బాబు గతంలో ఎప్పుడూ లేనంత తక్కువ వసూళ్లు ఇప్పుడు నమోదవుతున్నాయని, వారాంతాలలో లేదా సెలవులలో తప్ప థియేటర్ల వద్ద జనం కనిపించడం లేదని, చివరకు థియేటర్స్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు కూడా రావడం లేదని, జనాలు లేక షోస్‌ కాన్సిల్‌ చేస్తున్నారని చెప్పారు.

హాలీవుడ్‌లో ఇప్పటికే ఇండిపెండెంట్‌ సినిమా మేకర్స్‌ బాగా తగ్గిపోయారు. వారంతా నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆ సంస్థ షరతులకి అనుగుణంగా సినిమాలు తీస్తున్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో థియేటర్స్‌ బిజినెస్‌ మరింత దారుణంగా ఎఫెక్ట్‌ అయ్యే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English