తమిళోళ్లు ఫాస్టు.. మనోళ్లు లేటు

తమిళోళ్లు ఫాస్టు.. మనోళ్లు లేటు

ఏ కొత్త ట్రెండ్ అయినా హాలీవుడ్లో మొదలై.. ఆ తర్వాత ఇండియాలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత దక్షిణాది వాళ్లు అందిపుచ్చుకుంటారు. సౌత్ సినిమాల్లో ఈ మధ్య కాస్త జోరు తగ్గి ఉండొచ్చు కానీ.. చాలా అప్ డేటెడ్‌గా ఉంటూ కొత్త ట్రెండ్స్‌ను అందిపుచ్చుకోవడంలో తమిళ ఫిలిం మేకర్స్ ముందుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వెబ్ సిరీస్ ట్రెండ్‌ను బాలీవుడ్ వాళ్లు బాగా అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున సిరీస్‌లు తయారు చేస్తున్నారు.

ఈ విషయంలో దక్షిణాది ఫిలిం మేకర్స్ కొంచెం వెనుకబడే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో వెబ్ సిరీస్‌ ఊపందుకోవడానికి ఇంకా సమయం పట్టేట్లుంది. పేరుమోసిన దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు వీటి వైపు ఇంకా అంత ఆసక్తి చూపించడం లేదు. కానీ తమిళ ఇండస్ట్రీ వాళ్లు మాత్రం ఈ విషయంలో ముందున్నారు.

కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్లు వెబ్ సిరీస్‌ల మీద దృష్టిసారిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన గౌతమ్ మీనన్ ఆల్రెడీ జయలలిత మీద వెబ్ సిరీస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు నెట్ ఫ్లిక్స్ వాళ్ల కోసం విఘ్నేష్ శివన్, సుధ కొంగర లాంటి పాపులర్ డైరెక్టర్లు వెబ్ సిరీస్‌లు చేయడానికి కమిట్మెంట్లు ఇచ్చారు. ఈ జాబితాలోకి గ్రేట్ డైరెక్టర్ వెట్రిమారన్ కూడా వచ్చేశాడు. ‘పొల్లాదవన్’, ‘ఆడుగళం’, ‘విసారణై’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ లాంటి గొప్ప సినిమాలు తీసిన వెట్రిమారన్.. త్వరలోనే వెబ్ సిరీస్ మొదలుపెట్టనున్నాాడు.

ఇందులో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. అందులో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర చేయనున్నాడు. కోలీవుడ్ నుంచి పేరు మోసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా వెబ్ సిరీస్‌ల వైపు అడుగులేస్తున్నారు. కానీ మన స్టార్ దర్శకులు, ఆర్టిస్టులు మాత్రం వెబ్ సిరీస్‌లను తక్కువగా చూస్తున్నట్లుంది. కానీ రెండు మూడేళ్లు పోయాక వీటి విలువ తెలిసి అందరూ ఇటువైపు అడుగులేయక తప్పదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English