'అర్జున్ రెడ్డి' బాటలో 'జార్జి రెడ్డి'

'అర్జున్ రెడ్డి' బాటలో 'జార్జి రెడ్డి'

ఒక కొత్త సినిమా విడుదలకు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్లు వేయాలంటే చాలా ధైర్యం ఉండాాలి. సినిమా మీద అపారమైన నమ్మకం ఉంటే తప్ప ఈ సాహసం చేయరు. యుఎస్‌లో ముందు రోజు ప్రిమియర్లు మామూలే కానీ.. అక్కడ షో పూర్తయ్యేసరికి మన కాలమానం ప్రకారం ముందు రోజు తెల్లవారుజాము అవుతుంది. సినిమా బాలేకపోయి ఆ సమయానికి నెగెటివ్ టాక్ వస్తేనే తట్టుకోవడం కష్టమవుతుంది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు రాత్రే షోలు వేసేస్తే సినిమా బాలేకుంటే డ్యామేజ్ మామూలుగా ఉండదు. అయినప్పటికీ కొన్ని సినిమాల మేకర్స్ ధైర్యం చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఊపందుకోవడానికి కారణమైన సినిమా 'బాహుబలి: ది కంక్లూజన్.' ఈ సినిమాకు ముందు రోజు రాత్రే పెయిడ్ ప్రిమియర్స్ పెద్ద ఎత్తున పడ్డాయి.

ఐతే 'బాహుబలి-2'కు ఉన్న క్రేజ్ వేరు. దానిపై ఉన్న అంచనాలు వేరు. ఐతే 'అర్జున్ రెడ్డి' అనే చిన్న సినిమాకు ఇదే సాహసం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దానికి పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్లు వేయగా.. అన్ని చోట్లా ఫుల్స్ పడిపోయాయి. ఆ షోల నుంచే అదిరిపోయే టాక్ వచ్చింది. సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆపై 'ఫలక్ నుమా దాస్' కు కూడా ఇదే స్టయిల్ ఫాలో అయ్యారు. కానీ దానికి ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు 'జార్జి రెడ్డి' అనే చిన్న సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్లు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఆల్రెడీ పది షోలకు పైగా బుకింగ్స్ ఓపెనయ్యాయి. బుకింగ్స్ వేగంగా జరుగుతుండటం విశేషం.

'అర్జున్ రెడ్డి' తరహాలోనే కొత్తగా, రెవల్యూషనరీగా కనిపించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ నెల 22న మంచి క్రేజ్ మధ్యే సినిమా రిలీజయ్యేలా ఉంది. మరి 'అర్జున్ రెడ్డి' మ్యాజిక్‌ను పునరావృతం చేస్తూ 'జార్జి రెడ్డి' కూడా పెద్ద హిట్టవుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English