వరుసగా చిరు టైటిళ్లు వాడేస్తున్నారే..

వరుసగా చిరు టైటిళ్లు వాడేస్తున్నారే..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ బిగ్గెస్ట్ హిట్లలో 'గ్యాంగ్ లీడర్' ఒకటి. ఆ సినిమాతో మెగా అభిమానులకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఆ టైటిల్‌ను మెగాస్టార్ తనయుడో.. లేదంటే మెగా ఫ్యామిలీ ఇంకొకరో వాడుకుంటారని ఆశించారు ఫ్యాన్స్. కానీ నేచురల్ స్టార్ నాని తన సినిమాకు 'గ్యాంగ్ లీడర్' టైటిల్ పెట్టుకుని వారికి షాకిచ్చాడు. దీని మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ తమిళ హీరో వరుసగా చిరు ఐకానిక్ టైటిళ్లను వాడేస్తుండటం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదు.. కార్తి. ఈ మధ్యే అతను 'ఖైదీ' సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ పేరుతో వచ్చిన చిరు సినిమా ఆయన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో తెలిసిందే. ఈ టైటిల్‌ను డబ్బింగ్ సినిమాకు పెట్టుకోవడం మెగా అభిమానులకు రుచించలేదు. కాకపోతే క్రేజ్ కోసం కాకుండా కథానుసారమే కార్తి తన సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నాాడు. తమిళంలో కూడా అదే పేరుతో సినిమా తెరకెక్కడం విశేషం. సినిమా చూసిన జనాలు ఆ టైటిల్ విషయంలో కన్విన్స్ అయ్యారు. సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు కార్తి తన తర్వాతి సినిమాకు కూడా మెగాస్టార్ పాత సినిమా టైటిలే ఫిక్స్ చేసుకోవడం విశేషం. నిన్ననే 'దొంగ' పేరుతో కార్తి కొత్త సినిమా ఒకటి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు దాని టీజర్ కూడాా రిలీజ్ చేశారు. తమిళంలో 'తంబి' (తమ్ముడు) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో 'దొంగ' అనే టైటిిల్ ఖరారు చేశారు. ఇంతకుముందు 'దృశ్యం' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో కార్తి దొంగ పాత్రలో కనిపిస్తుండటంతో ఆ టైటిల్ పెట్టినట్లున్నారు. జ్యోతిక, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English