‘జబర్దస్త్’కు షాక్ తగలబోతోందా?

‘జబర్దస్త్’కు షాక్ తగలబోతోందా?

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతి పెద్ద సక్సెస్ అయిన షోల్లో ‘జబర్దస్త్’ ఒకటి. ఈ షో కోట్లమందిని ఎలా అలరిస్తోందో తెలిసిందే. గురు, శుక్రవారాల్లో టీవీల ముందు కోట్ల మందిని కూర్చోబెట్టే ఈ షో.. యూట్యూబ్ ద్వారా మరికొన్ని కోట్ల మందిని అలరిస్తోంది. షో మీద ఎన్ని విమర్శలొచ్చినా.. అభ్యంతరాలు వ్యక్తమైనా ఇది సూపర్ హిట్ అనడంలో మరో మాటలేదు. దీనికి ఎంత మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ టాప్ టీఆర్పీ రేటింగ్స్‌తో సాగిపోతోందీ షో. దీనికి పోటీగా వివిధ ఛానెళ్లలో అనేక కామెడీ షోలు వచ్చాయి. కానీ ఏదీ దీనికి సాటి రాలేదు.

అచ్చంగా ‘జబర్దస్త్’ స్టయిల్లోనే మా టీవీలో ‘దేశముదుర్లు’ పేరుతో ఒక షో మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ షో ఏమైందో కూడా జనాలకు తెలియదు. హడావుడిగా మొదలై.. చడీచప్పుడు లేకుండా అది ఆగిపోయింది. ‘జబర్దస్త్’ స్టయిల్లో ఈటీవీలోనే మొదలైన షోలు కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఐతే ఇప్పుడు ఒక పోటీ ఛానెల్లో ‘జబర్దస్త్’కు షాకిచ్చే ఒక ప్రోగ్రాం మొదలు కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ షో కూడా పాత వాటిలాగే ఫ్లాప్ కావచ్చు అనుకోవడానికి లేదు.

ఎందుకంటే ప్రస్తుతం ‘జబర్దస్త్’ను ఏలుతున్న టీం లీడర్లతో పాటు జడ్జి నాగబాబు సైతం ఆ షోకు వెళ్లబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనుక మరో కారణం కూడా ఉంది. ‘జబర్దస్త్’ను నడిపించే ఇద్దరు డైరెక్టర్లు ఆల్రెడీ ఆ కార్యక్రమానికి టాటా చెప్పేశారట. షో రూపకర్తలైన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్‌ వాళ్లతో వాళ్లకు విభేదాలొచ్చి టాటా చెప్పేశారట. వాళ్లు నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి టీం లీడర్లను కొత్త షో వైపు లాగేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే కచ్చితంగా ‘జబర్దస్త్’ కళ తప్పుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English