మహేష్‌ హీరోయిన్‌ రచ్చ చేస్తోంది

మహేష్‌ హీరోయిన్‌ రచ్చ చేస్తోంది

మహేష్‌తో '1 నేనొక్కడినే'లో నటించిన క్రితి సనన్‌ ఆ తర్వాత నాగచైతన్యతో 'దోచేయ్‌' చేసింది. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్‌ అవడంతో క్రితి సనన్‌ ఇక మళ్లీ తెలుగులో కనిపించకుండా పోయింది. కానీ ఆమెకి బాలీవుడ్‌లో బాగా కలిసి వచ్చింది. అక్కడ పలు హిట్‌ చిత్రాల్లో నటించిన క్రితి సనన్‌ ఇటీవలే 'హౌస్‌ఫుల్‌ 4'లో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించింది. ఆమె నటించిన పీరియడ్‌ డ్రామా 'పానిపట్‌' త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోంది.

తాజాగా ఆమెకి మరో భారీ చిత్రంలో అవకాశం దక్కింది. అక్షయ్‌కుమార్‌తో కలిసి 'బచ్చన్‌ పాండే' అనే చిత్రంలో ఆమె మరోసారి నటించబోతోంది. బాలీవుడ్‌లో సక్సెస్‌ కావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ వుండాలి. ముఖ్యంగా హీరోయిన్లకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ అంత ఈజీగా లభించదు.

ఒకవేళ ఎంట్రీ దక్కినా కానీ పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రావు. కానీ క్రితి సనన్‌కి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా కానీ తన గ్లామర్‌, టాలెంట్‌తోనే బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయింది. తనకి తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ కూడా సక్సెస్‌ కావాలని వుందట కానీ ప్రస్తుతానికి హిందీ చిత్రాల పైనే దృష్టి పెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English