అమలా పాల్.. మరో బోల్డ్ ఫిలిం

అమలా పాల్.. మరో బోల్డ్ ఫిలిం

మలయాళ హీరోయిన్ అమలా పాల్ కెరీర్లో ఎన్నెన్నో మలుపులు. ఆమె కెరీర్ ఎప్పుడూ ఒక రకంగా సాగలేదు. ఆమె చేసిన తొలి చిత్రం ఒక బ-గ్రేడ్ ఫిలిం. భర్త తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్ర చేసిందందులో. ఇలాంటి పాత్రతో అరంగేట్రం చేసిన అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుందని.. విజయ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో సినిమాలు చేసే  స్థాయికి ఎదుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు.

కానీ ఇంత మంచి స్థాయికి చేరుకుని హీరోయిన్‌గా కొనసాగకుండా చిన్న వయసులోనే దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను పెళ్లాడి సినిమాలకు దూరం అయిపోయింది. కానీ ఆ బంధం కూడా ఎంతో కాలం సజావుగా సాగక మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది అమల. రీఎంట్రీలో మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వచ్చిన ఆమె సడెన్‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు టర్న్ తీసుకుంది.

అమలా కెరీర్లోనే అత్యంత బోల్డ్‌గా, న్యూడ్‌గా కనిపిస్తూ చేసిన ‘ఆడై/ఆమె’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. దక్షిణాదిన మరే హీరోయిన్ కనిపించనంత బోల్డ్‌గా కనిపించి.. పారితోషకం కూడా వదులుకుని ఈ సినిమా చేస్తే ఇలాంటి ఫలితం దక్కడం అమలాకు నిరాశ కలిగించేదే. మరొకరైతే మళ్లీ ఇలాంటి సాహసాలు చేయరు. కానీ అమలా మాత్రం అలా కాదు. మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు రెడీ అయింది. దాని పేరు.. అదో అంద పార్వై పోల. ఈ చిత్రంలోనూ అమలాకు నిర్మాాణ భాగస్వామ్యం ఉందట.

లేటెస్టుగా రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే ఈ కథ కూడా సాహసోపేతమైందే అనిపిస్తోంది. పూర్తిగా దట్టమైన అడవిలో సాగే కథ ఇది.అడవిలో కొందరు మానవ మృగాల మధ్య చిక్కుకున్న అమ్మాయి వాళ్ల నుంచి తప్పించుకుని ఎలా బయటపడిందన్న కథతో ఈ చిత్రం తెరకెక్కింది. పూర్తిగా అడ్వెంచరస్‌గా సాగే ఈ సినిమా కోసం అమలా చాలా కష్టపడి స్టంట్లు చేయడంతో పాటు బోల్డ్‌గానూ నటించినట్లుంది. ఈ చిత్రాన్ని వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English