రాజ‌శేఖ‌ర్ గురించి ఆ అనుమానాలే నిజం

రాజ‌శేఖ‌ర్ గురించి ఆ అనుమానాలే నిజం

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ఉన్న‌ట్లుండి వార్త‌ల్లోకి వ‌చ్చాడు. బుధ‌వారం రాత్రి రామోజీ ఫిలిం సిటీ నుంచి కారులో ప్ర‌యాణిస్తూ ఆయ‌న పెద్ద ప్ర‌మాదానికే గుర‌య్యాడు. కాక‌పోతే అది బ‌ల‌మైన బాడీ ఉన్న కారు కావ‌డం, ఎయిర్ బెలూన్స్ స‌మ‌యానికి ఓపెన్ కావ‌డంతో ఆయ‌న స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిపోయారు. దీంతో రాజ‌శేఖ‌ర్ కుటుంబీకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

రాజ‌శేఖ‌ర్ సేఫ్ అని తెలిశాక ఇంత‌కీ రాజ‌శేఖ‌ర్ ఫిలిం సిటీ నుంచి ఎందుకొస్తున్నాడు అని ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. క‌ల్కి త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ ఓ క‌న్న‌డ రీమేక్ మూవీ ఒప్పుకోవ‌డం.. అనివార్య కార‌ణాల‌తో దాన్నుంచి బ‌య‌టికి వ‌చ్చేయ‌డం తెలిసిన సంగ‌తే. దీని త‌ర్వాత ఈ సీనియ‌ర్ హీరో కొత్త సినిమా గురించి ఎలాంటి స‌మాచారం లేదు.

ఐతే అహ‌నా పెళ్లంట‌, పూల రంగ‌డు లాంటి సినిమాల‌తో హిట్లు కొట్టి ఆ త‌ర్వాత నాగార్జున‌తో భాయ్ తీసి అడ్ర‌స్ లేకుండా పోయిన వీర‌భ‌ద్రం చౌద‌రితో రాజ‌శేఖ‌ర్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో వీర‌భ‌ద్రంతో రాజ‌శేఖ‌ర్ సినిమా చేయ‌డం అవ‌స‌ర‌మా అన్న చ‌ర్చ కూడా జ‌రిగింది. నిజంగా ఈ కాంబినేష‌న్లో సినిమా ఉంటుందా అన్న సందేహాలు కూడా క‌లిగాయి. ఐతే వీళ్లిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తున్న మాట వాస్త‌వ‌మే అని తాజా యాక్సిడెంట్‌తో రుజువైంది.

గురువారం సాయంత్రం రాజ‌శేఖ‌ర్‌ను వీర‌భ‌ద్రం ప‌రామ‌ర్శించి ట్విట్ట‌ర్లో అప్ డేట్ ఇచ్చాడు. దీన్ని బ‌ట్టి వీళ్ల క‌ల‌యిక‌లో సినిమా ప‌క్కా అని తేలిపోయింది. ఆల్రెడీ ఫిలిం సిటీలో వీళ్ల సినిమా చిత్రీక‌ర‌ణ కూడా మొద‌లైంద‌ని అంటున్నారు. అక్క‌డి నుంచి వ‌స్తూనే రాజ‌శేఖ‌ర్ ప్ర‌మాదానికి గుర‌య్యాడ‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English