బాబోయ్ బాక్సాఫీస్.. మ‌ళ్లీ వెల‌వెల‌

బాబోయ్ బాక్సాఫీస్.. మ‌ళ్లీ వెల‌వెల‌

తెలుగు సినిమాల‌కు మ‌రోసారి క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వెల‌వెల‌బోతోంది. ఆక్యుపెన్సీ లేక‌.. థియేట‌ర్ల రెంట్ల‌కు కూడా స‌రిప‌డా వ‌సూళ్లు రాక ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఉన్న సినిమాలు వేటికీ క‌లెక్ష‌న్లు లేవు. మొత్తం ఆక్యుపెన్సీలో 20 శాతం కూడా నిండ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌ల్టీప్లెక్సుల్లో అయినా హిందీ, ఇంగ్లిష్ సినిమాల‌కు ఆక్యుపెన్సీ ప‌ర్వాలేదు కానీ.. సింగిల్ స్క్రీన్ల ప‌రిస్థితే ఘోరంగా ఉంది. ఒక్కో షోకు నాలుగైదు వేల మ‌ధ్య గ్రాస్ వ‌స్తోంది ప్ర‌స్తుతం. గ‌త వారం రిలీజైన శ్రీ విష్ణు సినిమా తిప్ప‌రా మీసం తొలి షోతోనే ఔట్ అయిపోయింది. వీకెండ్లో కూడా సినిమా నిల‌బ‌డ‌లేదు. ఆ త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయింది.

అంత‌కుముందు వారం వ‌చ్చిన మీకు మాత్ర‌మే చెప్తా వీకెండ్ వ‌ర‌కు ఓ మోస్త‌రుగా ఆడి వెళ్లిపోయింది. దీపావ‌ళికి వ‌చ్చిన త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు విజిల్, ఖైదీ ఒక‌ట్రెండు వారాలు ఆడి డ‌ల్ అయిపోయాయి. ఇప్ప‌టికీ కాస్త న‌యం అనిపిస్తున్న‌వి ఈ చిత్రాలే. సైరా త‌ర్వాత ఏ తెలుగు సినిమా కూడా నిల‌బ‌డ‌లేదు. వ‌చ్చిన ప్ర‌తి సినిమా ఫ్లాపే. చూస్తుంటే ఇంకొన్ని వారాలు ఇదే ప‌రిస్థితి కొన‌సాగేలా క‌నిపిస్తోంది.

ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్న సందీప్ కిష‌న్ సినిమా తెనాలి రామ‌కృష్ణ‌కు కూడా పెద్ద‌గా బ‌జ్ లేదు. దాంతో పోలిస్తే విశాల్ డ‌బ్బింగ్ సినిమా యాక్ష‌న్‌కే కాస్త క్రేజ్ ఎక్కువ‌గా ఉంది. డిసెంబ‌ర్లో క్రిస్మ‌స్ సినిమాలు వ‌చ్చే వ‌ర‌కు తెలుగు సినిమాల ప‌రిస్థితి మెరుగుప‌డేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English