భీష్మ డేట్‌ రిస్కే బాసూ!

భీష్మ డేట్‌ రిస్కే బాసూ!

భీష్మ చిత్రాన్ని పెద్ద సినిమాలకి దూరంగా, మహాశివరాత్రి హాలిడే ఒకటి కలిసొచ్చేటట్టుగా ఫిబ్రవరి 21న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే పాతిక కోట్ల వరకు బిజినెస్‌ చేయాల్సిన ఈ చిత్రాన్ని పరీక్షల సీజన్‌లో విడుదల చేయడం శ్రేయస్కరం కాదని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

గతంలో నితిన్‌ సినిమా ఇష్క్‌ ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయి సక్సెస్‌ అయినా కానీ అప్పుడు దాని బిజినెస్‌ చాలా తక్కువ. కనీసం భీష్మ రేంజ్‌లో సగం కూడా లేదు. పైగా యూత్‌ని టార్గెట్‌ చేసిన సినిమాని పరీక్షల వేళ విడుదల చేస్తే లాంగ్‌ రన్‌కి స్కోప్‌ వుండదు. ఒకవైపు సమ్మర్‌లో చెప్పుకోతగ్గ పెద్ద సినిమాలేవీ ఇప్పటివరకు ఖరారు కాలేదు. కనుక మంచి డేట్‌ చూసుకుని భీష్మని ఏప్రిల్‌కి పుష్‌ చేస్తే ప్లస్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాల వారు సూచిస్తున్నారు.

అనుకున్న సమయానికి వెంకీ కుడుముల తీయలేకపోవడం వల్ల భీష్మ డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరికి వాయిదా పడింది. ఎలాగో వాయిదా పడినపుడు ఒక రెండు నెలల వడ్డీ భారం మోసి ఇంకా మంచి తేదీ చూసుకోవడం ఉత్తమమనేది పండితుల సలహా. అసలే నితిన్‌కి ఈ చిత్రం ఫలితం చాలా కీలకం. దీని తర్వాత వచ్చే నితిన్‌ సినిమా రంగ్‌దేకి కూడా అదే నిర్మాత కనుక ఈ చిత్రానికి మంచి ముహూర్తం చూసుకోవడం ఉత్తమం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English