తెలుగు సినిమా బిజినెస్‌కి ఇంకో రంధ్రం

తెలుగు సినిమా బిజినెస్‌కి ఇంకో రంధ్రం

ఇప్పటికే ఓవర్సీస్‌ మార్కెట్‌ బాగా పడిపోవడంతో గతంలో మాదిరిగా అక్కడ కోట్లకి కోట్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. ఇంకోవైపు కర్నాటకలో కూడా తెలుగు సినిమా ఒక గీత దాటి ముందుకి పోవడం లేదు. తాజాగా హిందీ అనువాద హక్కులకి కూడా రేటు పడిపోయింది. ఇంతకుముందు ఇచ్చిన రేట్లు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడడం లేదు.

మహర్షి చిత్రానికి ఇరవై కోట్లు పలికిన హిందీ డబ్బింగ్‌, డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకి వచ్చేసరికి పదిహేను కోట్లకి పడిపోయింది. మహేష్‌ సినిమాకే ఇంత తక్కువ పలికితే ఇక అల్లు అర్జున్‌ చిత్రం 'అల వైకుంఠపురములో'కి కూడా ఎక్కువ ధర రాదనే అర్థమవుతోంది.

ఈ రెండు సినిమాలకీ హిందీ అనువాదం తదితర రైట్స్‌ నుంచి ఇరవై కోట్ల వరకు వస్తాయని అంచనా వేసారు. మూడు, నాలుగు నెలల క్రితమే అమ్మేసినట్టయితే నిజంగా అంత ధర పలికేవేమో కానీ ఆలస్యం చేయడం వల్ల కొత్త రేట్లలోకి వెళ్లిపోయాయి. హీరోలకి ఇచ్చే పారితోషికం బదులుగా ఇలాంటివి రాసేస్తున్నారు కనుక నిర్మాతలకి ఇది పెద్ద భారం కాబోదు కానీ పెరిగిన మార్కెట్‌ సడన్‌గా తరిగిపోవడం మాత్రం శుభ పరిణామం కానే కాదు సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English