ఆడిషన్స్‌కు వెళ్తే రేప్ సీన్ చేయమన్నారట

ఆడిషన్స్‌కు వెళ్తే రేప్ సీన్ చేయమన్నారట

సినీ అవకాశాల కోసం ఎన్నో ఆశలతో వచ్చే అమ్మాయిల్ని లోబరుచుకోవడానికి మోసం చేసే వ్యక్తులు చాలామందే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో తమకెలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో పెద్ద స్థాయికి ఎదిగిన హీరోయిన్లు కూడా వివిధ సందర్భాల్లో వెల్లడించారు. తమకంటూ గుర్తింపు వచ్చే వరకు వేచి చూసి ఆ తర్వాత ఈ అనుభవాల గురించి హీరోయిన్లు వెల్లడిస్తుంటారు. తాజాగా ‘ఉజ్దా చమన్’ సినిమాతో మంచి పేరు సంపాదించిన మాన్వి గాగ్రూ కొన్నేళ్ల కిందట ఆడిషన్స్ సందర్భంగా ఎదురైన దారుణమైన అనుభవం గురించి ఓ ఇంగ్లిష్ పత్రికతో పంచుకుంది.

తాను గతంలో ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్‌కు వెళ్లానని... ఆడిషన్స్ కోసం ఎంచుకున్న ఆఫీస్ చాలా చెత్తగా ఉందని.. దాన్ని చూసి కంగారు పడుతుంటే.. ఆడిషన్స్‌లో భాగంగా తనను రేప్ సీన్లో నటించాలని అడిగారని మాన్వి వెల్లడించింది. ఆఫీసులో పెద్దగా జనాలు కూడా లేరని.. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని.. అక్కడి వాతావరణం చూసి భయంతో బయటికి పరుగులు తీశానని మాన్వి తెలిపింది. ఆఫీస్ అని చెప్పుకున్న ఆ గదిలో పడక మంచం ఉందని.. దాన్నెలా ఆఫీస్ అని చెప్పుకున్నారో తనకు అర్థం కాలేదని ఆమె అంది.  

మాన్వి టెలివిజన్‌ షో ‘ధూమ్‌ మచావో ధూమ్‌’తో 2007లో కెరీర్‌ ఆరంభించింది. ‘ట్రిప్లింగ్’, ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ లాంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ కనిపించింది. సన్నీ సింగ్‌ హీరోగా ఇటీవలే విడులైన ‘ఉజ్డా చమన్‌’ ఆమెకు పెద్ద బ్రేక్ అని చెప్పొచ్చు. ఇందులో బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే బరువైన అమ్మాయిగా మాన్వి పెర్ఫామెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మంచి విజయం కూడా సాధించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English