ఆర్ఆర్ఆర్ సీక్రెట్ రివీలయ్యే రోజు అదేనా?

ఆర్ఆర్ఆర్ సీక్రెట్ రివీలయ్యే రోజు అదేనా?

ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకులందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా. ‘బాహుబలి’తో శిఖర స్థాయి ఇమేజ్ సంపాదించిన దర్శక ధీరుడు రాజమౌళి నుంచి రాబోతున్న తర్వాతి చిత్రమిది. ఇప్పటిదాకా కెరీర్లో ఫెయిల్యూర్ అనే మాటే లేని జక్కన్న.. జైత్రయాత్రను కొనసాగిస్తూ ‘ఆర్ఆర్ఆర్’తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడని అంచనా వేస్తున్నారంతా.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల క్రేజీ కాంబినేషన్లో.. ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని లాంటి పరభాషా నటీనటుల కలయికలో ఈ చిత్రాన్ని ఓ మైలురాయిలా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. ఐతే ఈ సినిమా అనౌన్స్ అయి ఏడాది అవుతున్నా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. హీరోల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయలేదు.జనాలు ఇదిగో అదిగో అనుకుంటున్నారు తప్పితే చిత్ర బృందం ఈ విషయంలో ఏ అధికారిక ప్రకటనా చేయలేదు.

రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (ఎన్టీఆర్)ల పేర్లు కలిసొచ్చేలా ఈ చిత్రానికి ముందు ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆ అక్షరాలు కలిసొచ్చేలాగే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు రాజమౌళి వెల్లడించాడు. ఈ అక్షరాలు కలిసొచ్చేలా టైటిల్స్ సూచించమని అడిగాడు. పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. కానీ ఏ టైటిల్ ఖరారైందన్నది మాత్రం వెల్లడి కాలేదు. ఈ ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఐతే ఇంకో నెలన్నరలో ఈ సంగతి వెల్లడైపోతుందన్నది తాజా సమాచారం. ఇందుకోసం ముహూర్తం కుదిరిందట. కొత్త సంవత్సర కానుకగా జనవరి 1న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి స్వరూపాన్ని వెల్లడించనున్నారని.. టైటిల్ లోగో కూడా లాంచ్ చేస్తారనరి.. కుదిరితే ఆ రోజు ఫస్ట్ లుక్స్ కూడా బయటికి రావచ్చని అంటున్నారు. రిలీజ్ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తొలి విశేషాన్ని పంచుకోవాలని జక్కన్న డిసైడ్ అయ్యాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English