పవన్ వస్తే ఆ సినిమా పంట పండినట్లే

పవన్ వస్తే ఆ సినిమా పంట పండినట్లే

జార్జిరెడ్డి.. ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారిన చిన్న సినిమా. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనం రేపిన జార్జి రెడ్డి కథతో జీవన్ రెడ్డి అనే దర్శకుడు తీసిన చిత్రమిది. ‘వంగవీటి’లో టైటిల్ రోల్ చేసిన సందీప్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్ సంచలనం రేపింది. ‘అర్జున్ రెడ్డి’ తరహాలో ఈ సినిమా ట్రెండ్ క్రియేట్ చేయగలదన్న అంచనాలు కలిగాయి.

కేవలం ఆ ట్రైలర్‌తోనే ఈ సినిమాకు బిజినెస్ అయిపోవడం విశేషం. ఈ నెల 22న ‘జార్జి రెడ్డి’ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. ఈ సినిమా పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ‘జార్జి రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు పవన్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తాయి.

పవన్ మనస్తత్వాన్ని బట్టి చూస్తే చేగువేరా, భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులు ఆయనకెంతో ఇష్టం. జార్జి రెడ్డి కూడా ఈ కోవలోని వాడే. బ్రిలియంట్ స్టూడెంట్ అయిన జార్జిరెడ్డి.. ఒకప్పుడు చైతన్యానికి, రాజకీయాలకు కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో అనేక సంచలనాలకు కారణమయ్యాడు. యూనివర్శిటీలో స్వయంగా తన సామాజిక వర్గం ఆధిపత్యం మీదే పోరాడటం.. అణగారిన వర్గాలకు చెందిన వాళ్లకు అండగా నిలవడం జార్జి రెడ్డి ప్రత్యేకత.

బాక్సర్ అయిన జార్జిరెడ్డి ప్రత్యర్థులతో రియల్ ఫైట్లు చేశాడు. ఒక సందర్భంలో 20కి పైగా కత్తి పోట్లు ఎదుర్కొన్నప్పటికీ బతికి బట్టగట్టాడు. చివరికి ఇలాంటి ఒక ఎటాక్‌తో యుక్త వయసులోనే ప్రాణాలు విడిచాడు. జార్జిరెడ్డి బతికి ఉంటే పెద్ద రాజకీయ నాయకుడు అయ్యేవాడంటారు విశ్లేషకులు. ఎంతో స్ఫూర్తిదాయకమైన జార్జిరెడ్డి కథ సినిమాగా రావడం పట్ల పవన్ ఎగ్జైట్ అయ్యాడని.. దీని ట్రైలర్ కూడా ఆయనకు నచ్చిందని.. ఈ నేపథ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్‌‌కు వచ్చి సినిమాకు సపోర్ట్ చేయాలని పవన్ అనుకుంటున్నాడట. ఇదే నిజమైతే ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English