రాహులో రాహులా జాక్‌పాటు కొడితివిరో..

రాహులో రాహులా జాక్‌పాటు కొడితివిరో..

రాహుల్‌ సిప్లిగంజ్‌ కనుక బిగ్‌బాస్‌ హౌస్‌లో లేనట్టయితే సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'రాములో రాములా' అతనితోనే పాడించి వుండేవారు. దీపావళికి పాట విడుదల చేయాలని డిసైడ్‌ అవడం వలన రాహుల్‌తో కాకుండా ఆ పాటని అనురాగ్‌ కులకర్ణితో పాడించేసారు. ఒక సూపర్‌హిట్‌ సాంగ్‌ మిస్‌ అయినా కానీ 'అల వైకుంఠపురములో' మొదలైన 'మ్యూజిక్‌ వీడియో' తరహా ట్రెండు రాహుల్‌ సిప్లిగంజ్‌కి యమాగా కలిసి వచ్చేలాగుంది. బిగ్‌బాస్‌తో రాహుల్‌ వీర పాపులర్‌ అవడంతో చాలా మంది అతనితో 'అల వైకుంఠపురములో' తరహాలో మ్యూజిక్‌ వీడియో తరహా సింగిల్స్‌ చేయాలని చూస్తున్నారు.

రంగస్థలం చిత్రంలో రంగ రంగ రంగస్థలాన పాట పాడిన రాహుల్‌తో 'సరిలేరు నీకెవ్వరు'లో దేవిశ్రీప్రసాద్‌ ఒక హుషారైన పాట పాడిస్తున్నాడని సమాచారం. ఎలాంటి పాటనయినా ఉచ్ఛారణ దోషాలు లేకుండా హై పిచ్‌లో పాడగలిగే రాహుల్‌కి ఇక మీదట చాలా పాటలే రాబోతున్నాయి. ఇదివరకటిలా ఒకే సింగర్‌తో అన్ని పాటలు పాడించే సంప్రదాయం ఇప్పుడు లేదు కానీ సింగర్‌ తాలూకు క్రేజ్‌ని అయితే బాగానే క్యాష్‌ చేస్తున్నారు. సిడ్‌ శ్రీరామ్‌ అలాగే ఇప్పుడు తెలుగు సినీ రంగంలో మోస్ట్‌ వాంటెడ్‌ సింగర్‌ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English