చిరు అల్లుడి మెడకి చుట్టుకున్న మీసం!

చిరు అల్లుడి మెడకి చుట్టుకున్న మీసం!

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కూడా తన బావ, ఇతర మెగా హీరోల మాదిరిగా హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. కెజిఎఫ్‌ స్టార్‌ యష్‌ని తలపించే ఆహార్యంతో తిరుగుతోన్న కళ్యాణ్‌ దేవ్‌ ఇటీవలే తన రెండవ చిత్రం 'సూపర్‌ మచ్చి' అనౌన్స్‌ చేసాడు. మొదటి సినిమా 'విజేత' కనీస ఆదరణకి నోచుకోకపోయినా కానీ ఇంకా తనకి మెగా అభిమానుల ఆశీర్వాదం వుంటుందని కళ్యాణ్‌ దేవ్‌ ఆశిస్తున్నాడు. అయితే ఈ 'సూపర్‌ మచ్చి' చిత్ర నిర్మాతలు విపరీతమైన ఆర్థిక ఒత్తిళ్లకి లోనవుతున్నారని సమాచారం.

ఇటీవలే వారు తీసిన 'తిప్పరా మీసం' విడుదలై ఘోర పరాజయం పాలయింది. దీంతో 'సూపర్‌ మచ్చి' చిత్రానికి ఫైనాన్స్‌ ఇచ్చే వాళ్లు, అడ్వాన్స్‌ ఇచ్చే వాళ్లు కూడా కానరావడం లేదట. దీంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి వుంచారని, ఆర్థికంగా అన్నీ సమకూరిన తర్వాత మొదలు పెడతారని అంటున్నారు. కళ్యాణ్‌ దేవ్‌కి హీరో కావాలనే కోరిక వుందని తెలిసినా కానీ చిరంజీవి తరఫు నుంచి ఎలాంటి రికమండేషన్లు లేవు. అలాగే మెగా కాంపౌండ్‌కి చెందిన నిర్మాణ సంస్థలు కూడా అతని ముచ్చట తీర్చే పని పెట్టుకోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English