మహేష్‌ ప్యాంట్‌ హైలైట్‌ అయిపోతోంది

మహేష్‌ ప్యాంట్‌ హైలైట్‌ అయిపోతోంది

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్‌ ఆర్మీ మేజర్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం కాసేపు మేజర్‌గా చూపించినా కానీ తర్వాత అంతా జరిగేది రెగ్యులర్‌ ఫ్యామిలీ, ఫ్యాక్షన్‌ డ్రామానే. అనిల్‌ రావిపూడి దర్శకుడు కనుక ఈ చిత్రంలో కామెడీకి కూడా లోటుండదు. ప్రమోషన్స్‌ విషయంలో బాగా వెనకబడిన ఈ చిత్రానికి అడపాదడపా ఒక స్టిల్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

అయితే ఇంతవరకు విడుదలైన చాలా పోస్టర్లలో మహేష్‌ మిలటరీ వాళ్లు ధరించే కామాఫ్లాజ్‌ ప్రింట్‌ ప్యాంట్‌ ధరించడంతో ఎంత ఆర్మీ మేజర్‌ అయితే మాత్రం కాస్టూమ్స్‌లో ఇంత కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ చూపించాలా అనే జోక్స్‌ పడుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి నిలబడ్డ పోస్టర్‌ చూసినా, కత్తి పట్టుకుని కొండారెడ్డి బురుజు ముందు నిలుచున్నా కానీ అతని ప్యాంట్‌ మాత్రం మారడం లేదు.

ఆర్మీ మేజర్‌ అనేది రిజిష్టర్‌ చేయడానికో లేదా ఆ పాత్ర తాలూకు పవర్‌ చూపించడానికో అనిల్‌ రావిపూడి కావాలని చేసినట్టున్నాడు. ఇలాంటి చిన్న విషయాలని విస్మరిస్తే, ఈ చిత్రంలో కామెడీ చాలా బాగా వచ్చిందని, ట్రెయిన్‌ కామెడీ అయితే ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచిపోయేలా, రిపీట్‌ వేల్యూ తీసుకొచ్చేలా వుంటుందని చెబుతున్నారు. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English