ఫ్లాపుల పరంపరకి ఇప్పుడైనా బ్రేకేస్తాడా?

ఫ్లాపుల పరంపరకి ఇప్పుడైనా బ్రేకేస్తాడా?

సక్సెస్‌ కోసం సకల ప్రయత్నాలు చేసిన సందీప్‌ కిషన్‌ ఇప్పుడు కామెడీని నమ్ముకున్నాడు. 'తెనాలి రామకృష్ణ బిఏబిల్‌' చిత్రంలో 'జాలీ ఎల్‌ఎల్‌బి' తరహా కామెడి క్యారెక్టర్‌ చేసాడు. కామెడీ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్‌ అనిపించుకున్న నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో కామెడీ బాగానే వున్నట్టు అనిపిస్తోంది. అయితే ఆ తరహా హ్యూమర్‌ ఈ జబర్దస్త్‌ రోజుల్లో ఇంకా సేల్‌ అవుతుందా లేదా అనేది చూడాలి.

సందీప్‌ కిషన్‌ లాస్ట్‌ హిట్‌ ఎప్పుడనేది కూడా గుర్తు లేకుండా పోయింది. చివరకు సొంత సినిమా తీసి కూడా చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. 'తెనాలి రామకృష్ణ' తన ఫ్లాపుల పరంపరకి ముగింపు పలుకుతుందని, మళ్లీ తనకో నాలుగు కొత్త ఆఫర్లు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాడు. అతని అదృష్టం కొద్దీ ఈ వారంలో పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. కాకపోతే విశాల్‌ నటించిన యాక్షన్‌ చిత్రం అనువాదం శుక్రవారమే వస్తోంది.

అది ఈ చిత్రానికి బ్యాడ్‌ న్యూసే. యాక్షన్‌ ట్రెయిలర్స్‌ ప్రామిసింగ్‌గా వుండడంతో పాటు ఇటీవల తమిళ అనువాద చిత్రాలు బాగానే ఆడడం వల్ల తెనాలి రామకృష్ణకి అది త్రెట్‌ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెనాలి రామకృష్ణ ఎంతమేరకు ప్రేక్షకులని, నిర్మాతలని నవ్విస్తాడనేది త్వరలోనే తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English