తమిళ హైప్‌కి వెంకటేష్‌ పడిపోయాడా?

తమిళ హైప్‌కి వెంకటేష్‌ పడిపోయాడా?

ధనుష్‌ చిత్రం 'అసురన్‌' తమిళనాట ఘనవిజయం సాధించింది. ఆ చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌-ధనుష్‌ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్‌ సినిమాలు, సదరు దర్శకుడికి వున్న గుడ్‌ విల్‌ కూడా కలిసొచ్చి అసురన్‌ అంతగా హిట్టయింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో వుంది. విపరీతమైన హైప్‌ వుండడం వల్ల తెలుగు సినీ ప్రియులు కూడా దీనిని చూస్తూ తమ అభిప్రాయాలు షేర్‌ చేసుకుంటున్నారు.

ఇది తమిళ హైప్‌లా వుందనే మాట చాలా మంది నుంచి వినిపిస్తోంది. సినిమాలో మరీ అంత ఏమీ లేదని, ముఖ్యంగా ద్వితియార్థం చాలా నీరసరగా సాగుతుందని కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ చిత్రానికి వున్న హైప్‌కి పడిపోయి రీమేక్‌ రైట్స్‌ వెంకటేష్‌ తీసుకున్నట్టు వున్నారని, కానీ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేంత విషయం లేదని, ఇలాంటి చిత్రాలు చాలానే గతంలో రావడం వలన ఈ రీమేక్‌ గురించి పునరాలోచించుకోవాలని కూడా సలహాలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక పాత్ర వెంకీ వయసుకి తగ్గట్టు వున్నా కానీ కొడుకుగా వెంకీ ఈ వయసులో ఎలా వుంటాడనే క్వశ్చన్‌ కూడా వస్తోంది. అదీ కాక వెంకటేష్‌కి వున్న ఎంటర్‌టైనర్‌ ఇమేజ్‌కి ఏమాత్రం సరిపడని సినిమా ఇది. ఇదిలావుంటే ఈ చిత్రానికి దర్శకుడి వేట ఇంకా కొనసాగుతోంది. 'అందాల రాక్షసి' దర్శకుడు హను రాఘవపూడి పేరు కూడా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English