సామజవరగమనా... అతి చేస్తున్నారా?

సామజవరగమనా... అతి చేస్తున్నారా?

ఇంకా పిక్చరైజ్‌ కూడా చేయని పాట విపరీతంగా వైరల్‌ అయిపోతే ఇక దాని విజువల్స్‌ని క్రేజ్‌కి మ్యాచ్‌ అయ్యేట్టు చేయడానికి చాలా తంటాలు పడాలి. 'సామజవరగమనా' పాట విన్నట్టయితే అది తనని లెక్క చేయని ప్రేయసి కోసం ప్రియుడు పాడుకునే సింపుల్‌ పాట. మామూలుగా అయితే డ్రీమ్‌ సీక్వెన్స్‌లు కూడా లేకుండా మాంటాజ్‌లతో కానిచ్చేయాలి. కానీ పాట పెద్ద హిట్‌ అవడంతో మళ్లీ విజువల్స్‌ ఆ స్థాయిలో లేకపోతే ఎలాగంటూ ఈ పాటని చిత్రీకరించడం కోసం పారిస్‌ వెళ్లారు.

అక్కడ ఇంతవరకు చిత్రీకరించని లొకేషన్లు ఏరి కోరి చేస్తున్నారు. లొకేషన్స్‌తో పాటకి విజువల్‌ అప్పీల్‌ వస్తుంది కానీ ఆ పాటలోని ఫీల్‌ని, సోల్‌ని కొరియోగ్రఫీతో అందుకోగలరా అనేది అనుమానం. మామూలుగా ఈ పాట చేయించుకున్నపుడు వున్న విజువలైజేషన్‌ కాకుండా ఇప్పుడు మార్చేసారు. ఇప్పుడు ఈ పాటకి వున్న క్రేజ్‌కి అనుగుణంగా చిత్రీకరిస్తున్నారు.

ఆ సంగతి సామజవరగమనా లొకేషన్‌ స్టిల్స్‌ రిలీజ్‌ చేయడంతోనే తెలిసిపోయింది. మరి ఈ పాట విజువల్స్‌ పాటలోని మాధుర్యానికి ఎంతవరకు సరితూగుతాయనేది వేచి చూడాలి. వీడియో ప్రోమోని అతి త్వరలో విడుదల చేయబోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈలోగా ఈ చిత్రంలోని మూడవ పాటని కూడా ఇంతవరకు రిలీజ్‌ చేసిన మ్యూజిక్‌ వీడియోల తరహా స్టయిల్లోనే విడుదల చేయనున్నారని సమాచారం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English