కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతిసారీ...

కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతిసారీ...

శ్రియ సరన్ వయసిప్పుడు 37 ఏళ్లు. ఈ వయసుకి చాలామంది అక్క, వదిన పాత్రల్లోకి వచ్చేస్తుంటారు. అది కూడా హీరోయిన్ కెరీర్ అయిపోయాక బ్రేక్ తీసుకుని కొన్నేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంటారు. కానీ శ్రియ మాత్రం దాదాపు రెండు దశాబ్దాల నుంచి విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది. నిజానికి పదేళ్ల కిందటే ఆమె క్రేజ్ తగ్గిపోయింది.

స్టార్ హీరోయిన్ స్టేటస్ తీసేశారు. ఇంకెంతో కాలం ఆమె కెరీర్ కొనసాగదనీ అనుకున్నారు. కానీ ఇక శ్రియ పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ ఆమె బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంది. కాస్త క్రేజున్న ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. కెరీర్ ఆరంభంలో బాలయ్యతో నటించిన శ్రియ.. మళ్లీ పదిహేనేళ్ల విరామం తర్వాత 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో నటిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అంతటితో ఆగకకుండా బాలయ్యతోనే 'పైసా వసూల్' సినిమాలోనూ జత కట్టింది.

అంతటితో ఆమె పనైపోయిందనుకుంటే.. ఆ తర్వాత కూడా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఈ మధ్య శ్రియ పెళ్లి కావడం కెరీర్లో కొంచెం గ్యాప్ రావడంతో ఇక కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఆమె మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో శ్రియ ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ హిట్ 'అసురన్' రీమేక్‌లో వెంకీ నటించనున్న సంగతి తెలిసిందే. నడివయస్కుడి పాత్రకు జోడీగా ఒక సీనియర్ హీరోయిన్ కావాల్సి ఉండగా.. ముందు నయనతార అనుకుని ఆమె చాలా కాస్ట్లీ అనే అభిప్రాయంతో ఇప్పుడు శ్రియకు ఫిక్సయ్యారట. ఆమె కూడా మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకుందట.

సీనియర్ల పక్కన ఈ తరం హీరోయిన్లను పెట్టడం కష్టం కావడంతో శ్రియ, త్రిష లాంటి వాళ్లకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు శ్రియ నటించిన 'నరకాసురన్', 'తడ్కా' సినిమాలు పూర్తయినా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English