మామ తగ్గాడు.. మంచోడు ఫిక్సయ్యాడు

మామ తగ్గాడు.. మంచోడు ఫిక్సయ్యాడు

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘వెంకీ మామ’ సంక్రాంతి రేసులోకి రాబోతున్నట్లు గత నెల కొన్ని రోజుల పాటు విస్తృతమైన ప్రచారం జరిగింది. దీంతో సంక్రాంతి రేసులో ఉన్న మిగతా సినిమాల నిర్మాతల్లో కొంత కంగారు మొదలైంది. ఈ సినిమా నిజంగా సంక్రాంతికి వస్తే థియేటర్ల విషయంలో తకరారు తప్పదు. పైగా ఇది పక్కా ఫ్యామిలీ మూవీ కాబట్టి మిగతా సినిమాల వసూళ్ల మీదా ప్రభావం ఉంటుంది.

ఐతే ఒక దశలో సీరియస్‌గానే సంక్రాంతి విడుదలపై ఆలోచించిన నిర్మాత సురేష్ బాబు.. చివరికి రాయబారాలు ఫలించి, తమ సినిమాకు కూడా మంచిది కాదని సంక్రాంతి రేసు నుంచి సినిమాను తప్పించాడు. ఈ చిత్రానికి తాజాగా అనుకున్న డేట్.. డిసెంబరు 25. క్రిస్మస్ సీజన్లో కాస్త లేటుగా బరిలోకి దిగి సంక్రాంతి వరకు బ్యాటింగ్ చేసుకోవచ్చన్నది వీళ్ల ప్లాన్.

మొత్తానికి ‘వెంకీ మామ’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో అందరికంటే ఎక్కువగా సంతోషించింది ‘ఎంత మంచివాడవురా’ టీమే. సంక్రాంతికి షెడ్యూల్ అయిన మిగతా రెండు తెలుగు చిత్రాల రేంజ్ వేరు. అవి రేసులోంచి వెనక్కి తగ్గే అవకాశమే లేదు. ఎటొచ్చీ థియేటర్లు, వసూళ్ల విషయంలో బాగా ఇబ్బంది పడేది ఈ చిత్రమే. దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు టీజర్లో సంకేతాలిచ్చి.. ఆ తర్వాత ‘వెంకీ మామ’కు సంబంధించిన రూమర్లతో సైలెంటుగా ఉంది చిత్ర బృందం.

కానీ ఆ సినిమా వాయిదా పడటంతో మళ్లీ కళ్యాణ్ రామ్ సినిమా యూనిట్లో కదలిక వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కళ్యాణ్ రామ్ స్వయంగా ప్రకటన చేశాడు. జనవరి 15న తమ చిత్రం వస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించింది ఇప్పుడే. ప్రస్తుతానికి 12న ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ ఢీకొడుతుంటే.. మూడు రోజుల గ్యాప్ తర్వాత ‘ఎంత మంచివాడవురా’ రాబోతోంది. ఇక తమిళ డబ్బింగ్ మూవీ ‘దర్బార్’ను జనవరి 10నే థియేటర్లలోకి దింపేయాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English