చెత్త సినిమాకు కలెక్షన్ల మోత

చెత్త సినిమాకు కలెక్షన్ల మోత

ఏడు చేపల కథ అని ఒక చిన్న సినిమా. కొన్ని నెలల కిందట దీని ట్రైలర్ రిలీజ్ చేశారు. దాని నిండా జుగుప్సాకరమైన సన్నివేశాలు.. డైలాగులు. ఇక్కడ రాయడానికి, చర్చించడానికి కూడా వీలు లేని స్థాయిలో దిగజారిపోయి సన్నివేశాలు తీశారు. డైలాగులు పేల్చారు. నిన్ననే ఈ చిత్రం థియేటర్లలోకి దిగింది.

చూసిన వాళ్లందరూ చెత్త సినిమా అని.. మరీ దారుణమైన సీన్లు, డైలాగులు ఉన్నాయని.. సినిమా చీప్‌గా తీశారని అంటున్నారు. కానీ అరచేతిలో కావాల్సినంత శృంగారం అందుబాటులో ఉన్నా కుర్రాళ్లను మాత్రం ఈ సినిమాలోని బూతు డైలాగులు, సీన్లే ఆకర్షించినట్లున్నాయి. ఈ సినిమా కోసం ఎగబడిపోతున్నారు. మాస్ సెంటర్లలో ఈ చిత్రానికి తొలి రోజు హౌస్ ఫుల్స్ పడటం విశేషం. థియేటర్ల ముందు.. బాక్సాఫీస్ దగ్గర టికెట్ల కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొంది.

పెద్ద మాస్ హీరో సినిమాలకు టికెట్ల కోసం లైన్లలో జనాలు ఎగబడటం చూస్తుంటాం. అలంటి సన్నివేశాలు ‘ఏడు చేపల కథ’ థియేటర్ల ముందు దర్శనమివ్వడం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి రెగ్యులర్ మూవీ వెబ్ సైట్లు రివ్యూలు కూడా రాయలేదు. చూసిన రాసిన వాళ్లు కూడా దారుణం అన్నారు. అయితేనేం కలెక్షన్లకు ఢోకా లేదు.

తొలి రోజు ఈ చిత్రం ఆశ్చర్యకర వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోటిన్నర దాకా షేర్ రాబట్టినట్లు చెబుతున్నారు. ఈ స్థాయి సినిమాకు ఇలాంటి వసూళ్లు అనూహ్యమే. ఈ చిత్ర బృందం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి చేసిన చీప్ ట్రిక్స్ బాగానే వర్కవుటైనట్లు కనిపిస్తోంది. మున్ముందు ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరిగితే ఆశ్చర్యం లేదేమో.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English