కమల్ మళ్లీ సహజీవనమా?

కమల్ మళ్లీ సహజీవనమా?

లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి సహజీవన వార్తలతో హాట్ టాపిక్ అయ్యాడు.గురువారం కమల్ హాసన్ తన పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన లేటెస్ట్ ఫ్యామిలీ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో కమల్ అన్నయ్య చారుహాసన్ సహా అందరు కుటుంబ సభ్యులూ ఉన్నారు. కమల్ కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా ఉన్నారు.

ఐతే పూర్తిగా కమల్ కుటుంబ సభ్యులతో నిండిన ఈ ఫొటోలో ‘విశ్వరూపం’ కథానాయిక పూజా కుమార్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ నటిని ఇండియాకు తీసుకొచ్చింది కమలే. ‘విశ్వరూపం’ చిత్రంతోనే కమల్ ఆమెను భారతీయ సినిమాకు పరిచయం చేశాడు. తర్వాత ఆమె ‘విశ్వరూం-2’లోనూ నటించింది. అంతకంటే ముందు ‘ఉత్తమ విలన్’లోనూ ఆమె కథానాయికగా నటించింది.

వరుసగా పూజాతో సినిమాలు చేస్తున్నపుడే ఆమెతో కమల్ బంధం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ అప్పటికి గౌతమితో సహజీవనంలో ఉన్నాడు కమల్. కానీ తర్వాత ఆమె నుంచి విడిపోయాడు. గౌతమికి కమల్ దూరమయ్యాక పూజా ఆయనకు చేరువైందని.. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని వార్తలొచ్చాయి. ఇప్పుడు కమల్ ఫ్యామిలీ ఫొటోలో పూజా కనిపించడంతో సందేహాలకు బలం వచ్చింది.

పూజాతో కమల్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యాక కూడా ఆమెతో బంధం కొనసాగుతోందంటే అనుమానాలు కలుగకుండా ఉండవు. పైగా ఫ్యామిలీ ఫొటోలో ఆమె ఉంటే దాన్ని అవాయిడ్ చేయకుండా కమల్ రిలీజ్ చేశాడంటే ఇద్దరి బంధం గురించి జనాలు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ప్రస్తుతం పూజకైతే ఇండియాలో సినిమాలేమీ లేనట్లే ఉంది. అయినా కమల్ కోసమే ఆమె ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English