స్టైలు స్టైలురా ఇది సూపర్ స్టైలురా

స్టైలు స్టైలురా ఇది సూపర్ స్టైలురా

సూపర్ స్టార్ సినిమాల జోరు బాగా తగ్గి ఉండొచ్చు. ఆయన స్థాయి హిట్ కొట్టి చాలా కాలం అయ్యుండొచ్చు. ఈ మధ్య దక్షిణాదిలో వేరే హీరోలు ఆయన్ని దాటేసి ఉండొచ్చు. కానీ స్టైల్ అనే మాటకు వస్తే మాత్రం రజనీకి రజనీనే సాటి. ఈ విషయం  చివరగా రజనీ నుంచి వచ్చిన ఫ్లాప్ మూవీ ‘పేట’ చూసిన వాళ్లు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో రాబోతున్న ‘దర్బార్’లోనూ రజనీ మార్కు స్టైల్‌కు ఢోకా ఉండదనే అనిపిస్తోంది.

ఇప్పటికే మెస్మరైజింగ్ లుక్స్, పోస్టర్లతో అభిమానుల్ని మురిపించిన రజనీ.. ఇప్పుడు మోషన్ పోస్టర్‌తో వచ్చాడు. అందులో రజనీ తనదైన స్టైల్‌తో అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రజనీ పోలీస్ పాత్ర చేస్తున్నట్లు ఇంతకుముందే వెల్లడైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పోలీస్‌గా రజనీ రౌడీలపై కత్తితో రెచ్చిపోయి దాడి చేస్తున్నట్లుగా మోషన్ పోస్టర్ రూపొందించారు. కత్తి పట్టుకుని సూపర్ స్టార్ చేసిన వీరంగంలో స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది ఈ మోషన్ పోస్టర్. చివరగా కుర్చీలో రజనీ కూర్చున్న స్టయిల్ అయితే అదిరిపోయింది. ఇక తలైవా తలైవా అనే నినాదాలతో అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌడ్ స్కోర్ కూడా మోతెక్కిపోయింది. ఒకేసారి నాలుగు భాషల్లో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ పోస్టర్ కూడా కమలే రిలీజ్ చేయాల్సింది కానీ.. తెలుగులో దీన్ని లాంచ్ చేయడానికి పెద్ద స్టారే దొరకలేదా అన్న చర్చ జరుగుతుండటంతో ఈ రోజు ఉదయం నిర్ణయం మార్చుకున్నారు. మహేష్ బాబు చేతుల మీదుగా హడావుడిగా పోస్టర్ లాంచ్ చేయించారు. ‘దర్బార్’ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English