పాపం.. ఇంతా చేస్తే మ‌ళ్లీ వాయిదా

పాపం.. ఇంతా చేస్తే మ‌ళ్లీ వాయిదా

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ అరంగేట్ర సినిమా క‌థ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ సినిమా విష‌యంలో ఇప్ప‌టికే ఎంత డ్రామా న‌డిచిందో తెలిసిందే. ముందు బాలా ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రెడ్డి సినిమాను వ‌ర్మ పేరుతో రీమేక్ చేసి.. త‌ర్వాత ఔట్ పుట్ న‌చ్చ‌క దాన్ని ప‌క్క‌న ప‌డేసి అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన గిరీశ‌య్య‌ను పెట్టి ఆదిత్య వ‌ర్మ పేరుతో మ‌ళ్లీ కొత్త‌గా సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే.

కానీ దీని ప్రోమోలు కూడా మ‌రీ గొప్ప‌గా ఏమీ లేక‌పోవ‌డం, నెగెటివిటీ కొన‌సాగ‌డంతో సినిమా విడుద‌ల బాగా ఆల‌స్య‌మైంది. చాన్నాళ్లు ఎదురు చూసి చూసి చివ‌రికి న‌వంబ‌రు 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించారు. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగా చేశారు.

ఇక సినిమా విడుద‌ల కావ‌డ‌మే ఆల‌స్యం అనుకుంటుండ‌గా సెన్సార్ ద‌గ్గ‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. స‌ర్టిఫికేష‌న్ ఆల‌స్య‌మైంది. త‌క్కువ స‌మ‌యంలో రిలీజ్‌కు స‌న్నాహాలు చేయ‌డం క‌ష్ట‌మైంది. దీంతో మ‌ళ్లీ సినిమాను వాయిదా వేశారు. చివ‌ర‌గా ఈ చిత్రాన్ని న‌వంబ‌రు 21న రిలీజ్ చేస్తున్న‌ట్లుగా కొత్త ప్ర‌క‌ట‌న ఇచ్చారు. మ‌రి ఆ రోజు అయినా ప‌క్కాగా సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

అర్జున్ రెడ్డి లాంటి క‌ల్ట్ మూవీని ధ్రువ్ అరంగేట్రానికి ఎంచుకోవ‌డం విక్ర‌మ్ చేసిన త‌ప్పు. సీనియ‌ర్లే  చేయ‌డానికి భ‌య‌ప‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ రోల్‌ను కొత్త కుర్రాడికి ఇవ్వ‌డంతో అత‌ను అందులో ఫిట్ కాలేక‌పోయాడు. ఎప్పుడు త‌మ సినిమాల్ని నెత్తిన పెట్టుకునే త‌మిళ జ‌నాలే అర్జున్ రెడ్డితో పోల్చి ఈ సినిమా గాలి తీసేయ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English