ఆ డైరెక్టర్‌కి చరణ్‌ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందా?

ఆ డైరెక్టర్‌కి చరణ్‌ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందా?

'మనం'తో తెలుగు చిత్ర సీమ అంతటినీ తనవైపు తిప్పుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఆ తర్వాత తనకున్న జీనియస్‌ ట్యాగ్‌కి న్యాయం చేయలేకపోయాడు. 24 చిత్రంతో క్రియేటివ్‌గా మెప్పించినా కానీ హలో, గ్యాంగ్‌లీడర్‌ చిత్రాలు అతని క్రెడిబులిటీని శంకించేలా చేసాయి. గ్యాంగ్‌లీడర్‌ కథలో సమస్యలు వున్నాయని అల్లు అర్జున్‌ చెబితే వాటిని సరిచేయడం మానేసి అదే కథని నానికి చెప్పి ఓకే చేయించుకున్నాడు విక్రమ్‌.

తీరా ఆ చిత్రం అల్లు అర్జున్‌ డౌట్‌ పడినట్టే క్లిక్‌ అవలేదు. గ్యాంగ్‌ లీడర్‌ ఫ్లాప్‌ అయిన తర్వాత విక్రమ్‌ కుమార్‌ పట్ల వున్న క్రేజ్‌ బాగా తగ్గిపోయింది. అయితే మరోసారి ఒక అగ్ర హీరోతో సినిమా ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడు. రామ్‌ చరణ్‌ అపాయింట్‌మెంట్‌ కోసం విక్రమ్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మనం టైమ్‌లో అతనితో పని చేయడానికి చరణ్‌ ఆసక్తి చూపించాడట.

అందుకని చరణ్‌ కోసం ఒక కథ రెడీ చేసి చెప్పడానికి వెయిట్‌ చేస్తున్నాడట. కానీ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌తో బిజీగా వున్నాడు. ఆ తర్వాతి చిత్రం కూడా కొరటాల శివతో ఓకే చేసుకున్నాడు. చరణ్‌తో సినిమా అంటే కనీసం 2021 మార్చి వరకు అయినా వేచి చూడక తప్పదు. విక్రమ్‌ కుమార్‌ అంతవరకు వేచి చూస్తాడా లేక ఈ కథని మరెవరైనా చిన్న హీరోకి వినిపించి ఓకే చేయించుకుంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English