హ‌ద్దులు దాటేసిన ఇల్లీ బేబీ

హ‌ద్దులు దాటేసిన ఇల్లీ బేబీ

గాఢ‌మైన ప్రేమ అన్నారు. పెళ్లి చేసుకున్నార‌న్నారు. బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు కూడా వార్త‌లొచ్చాయి. కానీ ఉన్న‌ట్లుండి బ్రేక‌ప్ అంటూ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఇలియానా కూడా ధ్రువీక‌రించేసింది. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నుంచి ఆమె ఈ మ‌ధ్యే విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పూర్తి స్థాయిలో మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టిపెట్టాల‌ని చూస్తోంది ఇల్లీ బేబీ. ఆమె న‌టించిన కొత్త సినిమా పాగ‌ల్ పంటి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీని ప్ర‌మోష‌న్ల కోసం చిత్ర బృందంతో క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చిన ఇల్లీని చూసి అంద‌రూ షాకైపోయారు.

ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఎక్స్‌పోజింగ్‌తో మ‌తులు పోగొట్టిన ఇలియానా.. ఇప్పుడు హ‌ద్దులు దాటేసింద‌నే చెప్పాలి. ఎద అందాల్ని మునుపెన్న‌డూ లేని స్థాయిలో ఓపెన్ చేసి చూపిస్తూ త‌న‌ను చూసి అంద‌రూ నోరెళ్ల‌బెట్టేలా చేసింది. మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాల‌నుకుంటే మాత్రం మ‌రీ ఈ స్థాయిలో రెచ్చిపోవాలా అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు ఈ ఫొటోలు చూసి. ఐతే ఈ ఎక్స్‌పోజింగ్ సంగ‌తేమో కానీ.. ఇలియానా ఇప్పుడు సినిమాల్లో కొన‌సాగ‌డానికి త‌గ్గ ఫిజిక్‌తో అయితే లేదు. పూర్తిగా షేప‌వుట్ అయిపోయి.. ప‌రిమితికి మించి లావైపోయి చూడ్డానికి ఎబ్బెట్టుగా క‌నిపిస్తోంది ఇలియానా. ఫిలిం కెరీర్‌ను ఇంకా సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్ల‌యితే మాత్రం ఆమె లుక్ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మారాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English