హీరోయిన్లకి డబ్బులతో ఎర వేస్తున్నారు

హీరోయిన్లకి డబ్బులతో ఎర వేస్తున్నారు

డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ఊపందుకోవడంతో కొత్త కంటెంట్‌ కోసం కంపెనీలు అన్నీ పోటీలు పడుతున్నాయి. ఆల్రెడీ అందుబాటులో వున్న దాని కంటే కొత్త కొత్త షోలతో ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇందుకోసం అడల్ట్‌ కంటెంట్‌నే అతిగా నమ్ముకుంటున్నాయి. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అడల్ట్‌ థీమ్‌ వున్న వాటికే ఆదరణ బాగుండడంతో అలాంటి షోలు, వెబ్‌ సిరీస్‌లు చేయడానికి కంపెనీలు సరదా పడుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం అవకాశాలు లేని హీరోయిన్లని ఎంచుకుంటున్నాయి.

ఎవరయితే సోషల్‌ మీడియాలో అరమరికలు లేకుండా అందాలు ఆరబోస్తున్నారో వారికే కాల్స్‌ వెళుతున్నాయి. ఇవి చేస్తాను, ఇవి చేయను అని లేకుండా న్యూడిటీ తప్ప మిగతావన్నీ చేసేలా ఒప్పుకుంటేనే ఇందులో అవకాశమిస్తారు. ఇందుకోసం హీరోయిన్లకి మంచి పారితోషికం కూడా ఆఫర్‌ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశమే రాని సమయంలో ఇలా వెబ్‌ సిరీస్‌ నుంచి లక్షల రూపాయల ఆదాయం వస్తుందంటే ఎవరు కాదంటారు.

సోషల్‌ మీడియా ఫోటోలతో హీరోయిన్లకి అవకాశాలు వస్తున్నాయని తెలియడంతో మిగతా వారు కూడా మోతాదు మించి అందాల ప్రదర్శన మొదలు పెట్టేసారు. తెలుగులో తీసినా కానీ ముఖ్యమయిన భాషలు అన్నిట్లోను అనువదించి ఒకేసారి అన్ని ఆడియో ఆప్షన్లతో విడుదల చేయడం వల్ల ఈ కంటెంట్‌కి నేషనల్‌ అప్పీల్‌ కూడా దక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English