పవన్‌ను ఇక పవర్‌ స్టార్‌గా చూడలేమా?

పవన్‌ను ఇక పవర్‌ స్టార్‌గా చూడలేమా?

పవన్ ఎప్పటికీ పవర్ స్టారే కదా.. ఆయన్ని అలా చూడకపోవడం ఏంటి అనిపిస్తోందా? పవన్‌కు పవర్ స్టార్ అనే పేరెందుకు వచ్చింది. తెరపై ఎంతో శక్తిమంతమైన పాత్రలు చేయడం వల్ల.. హీరోయిజం ఓ రేంజిలో పండించడం వల్ల అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే పాత్రలతో పవన్ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐతే రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కొంత కాలం  సినిమాలకు దూరమైన పవన్.. మళ్లీ ఈ రంగుల ప్రపంచంలోకి పునరామగనం చేస్తున్నాడు. ఆయన ‘పింక్’ రీమేక్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. కానీ ఈ సినిమాలు అభిమానులు కోరుకునే రీతిలో ఉంటాయా అన్నదే సందేహంగా మారింది. పవన్‌ పవర్ స్టార్‌ ఇమేజ్‌కు తగ్గ పాత్రలు ఈ చిత్రాల్లో చేసే అవకాశాలు కనిపించడం లేదు.

‘పింక్’లో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రలో కనిపించనున్నాడు పవన్. తమిళంలో అజిత్ కోసం ఈ పాత్రను కొంత మేర మార్చి హీరోయిజం జోడించినా కూడా అతడి అభిమానులకు ఆనలేదు. ఇలాంటి ఉదాత్తమైన పాత్రలో పవన్‌ను చూడటం ఆయన రాజకీయ అభిమానులకు ఆనందమే కానీ.. సగటు సినీ అభిమానికి మాత్రం రుచించేది కాదు.

మరోవైపు క్రిష్ సంగతి తెలిసిందే. అతడి సినిమాల్లో హీరో పాత్రలు కొంత ఉదాత్తంగానే ఉంటాయి. కథను అనుసరించి వెళ్లిపోతాయి. హీరోయిజం ఉండదు. కమర్షియల్ హంగులకు చోటుండదు. పవన్ ఇప్పుడు ఒప్పుకున్న రెండు సినిమాలూ ఆయన వ్యక్తిగత, రాజకీయ ఇమేజ్‌ను పెంచేవిగా ఉండొచ్చు కానీ.. అభిమానులు కోరుకునే హీరోయిజం వీటిలో ఉంటుందా అన్నది సందేహమే. ఇప్పుడు తాను రాజకీయ నాయకుడు కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు.. అందులో హీరో ఎలివేషన్లు.. మాస్ మసాలాలు వద్దని.. తన రాజకీయ ఇమేజ్‌కు కూడాా ఉపకరించే ఉదాత్తమైన కథలు, పాత్రలే చేయాలని పవన్ భావిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English