పాలిటిక్స్‌కు బాల‌య్య దూర‌మే... ఓన్లీ ఫ్యామిలీయేనా..!

పాలిటిక్స్‌కు బాల‌య్య దూర‌మే... ఓన్లీ ఫ్యామిలీయేనా..!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేష‌న్లో రూలర్ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య బోయ‌పాటి సినిమాకు క‌మిట్ కానున్నాడు. బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే సింహా, లెజెండ్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ఈ రెండు సినిమాల్లో డైలాగులు, ఫైట్లు బాల‌య్య‌, నంద‌మూరి అభిమానుల‌ను ఎలా మెప్పించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు సినిమాలు గ‌త ద‌శాబ్దంలోనే బాల‌య్య నుంచి వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి.

ఇప్పుడు వీరి కాంబోలో వ‌స్తోన్న హ్యాట్రిక్ ప్రాజెక్టు 2020 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఇక బోయ‌పాటి ఈ సినిమా కోసం స్క్రిఫ్ట్ వ‌ర్క్ ఇప్ప‌టికే రెడీ చేసేశాడు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా క‌థ కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ట‌. బోయ‌పాటి సినిమాలు ఇటీవ‌ల తేడా కొడుతున్నాయి. విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ సినిమాలో హింస ఎక్కువ అవ్వ‌డ‌మే అన్నది మెయిన్ కంప్లెంట్‌. ఇప్పుడు బాల‌య్య సినిమాలో హింస‌తో పాటు పొలిటిక‌ల్ ట‌చ్ కూడా బోయ‌పాటి పూర్తిగా త‌గ్గించేశాడ‌ట‌.

సింహా, లెజెండ్ రెండు సినిమాల్లోనూ పొలిటిక‌ల్ డైలాగులు ఎక్కువ‌. రాజకీయం మా బ్లడ్ లో ఉంది... సీటు కాదు.. అసెంబ్లీ గేటు దాట‌నివ్వ‌ను లాంటి డైలాగులు బాగా పేలాయి. అయితే ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో ?  తెలిసిందే. ఈ టైంలో పొలిటిక‌ల్ డైలాగులు పెడితే అవి తేడా కొట్ట‌డంతో పాటు వాటిపై బాగా సెటైర్లు పేల‌తాయ‌న్న సందేహంతోనే బోయ‌పాటి ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేశాడంటున్నారు. ఇక ప‌క్కా ఫ్యామిలీ క‌థ‌కు ఓ మోస్త‌రు సెంటిమెంట్ జోడించి ఈ సినిమా క‌థ ఉంటుందంటున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా సింహా, లెజెండ్ లా హెవీగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా వుండే పేరునే పరిశీలిస్తున్న‌ట్టు భోగ‌ట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English