నానీని మించిపోయేలా ఉన్నాడే..

నానీని మించిపోయేలా ఉన్నాడే..

సరైన పాత్ర పడితే నాని ఎలా చెలరేగిపోతాడో చాలా సినిమాల్లో చూశాం. ఈ మధ్య కాలంలో అతను తన టాలెంటుకు పూర్తి న్యాయం చేసిన పాత్ర ‘జెర్సీ’ చిత్రంలోని అర్జున్‌. క్రికెట్ కోసం ప్రాణాలే వదిలేసే పాత్రలో నాని జీవించేశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్లో నాని ఒదిగిపోయిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చిత్రం ఇప్పుడు హిందీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరో షాహిద్ కపూర్ హిందీలో అర్జున్ పాత్ర చేస్తుండగా.. మాతృక తీసిన గౌతమ్ తిన్ననూరినే అక్కడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం షాహిద్ గట్టిగానే సన్నద్ధమవుతున్నాడని.. తాజాగా రిలీజ్ చేసిన అతడి పిక్ చూస్తే అర్థమవుతోంది. నానీని మించి ఈ పాత్రకు అతను ఫిట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.

నాని ఎంత బాగా చేసినా.. అతను ఒక క్రికెటర్ లాగా కనిపించడు. అంత ఫిట్నెస్‌ అతడిలో లేదు. కానీ షాహిద్‌ది మామూలుగానే చిజిల్డ్ బాడీ. స్పోర్ట్స్ పర్సన్ పాత్రకు భలేగా ఫిట్ అవుతాడు. పైగా స్వతహాగా అతను క్రికెట్లో మంచి నైపుణ్యం ఉంది. నానీలా రెండు నెలలు శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో మరింత సులువుగా షాహిద్ అర్జున్ పాత్రలో ఒదిగిపోయే అవకాశముంది. కాకపోతే ఎమోషనల్ సీన్స్‌లో అతనెలా చేస్తాడు.. నానీని మ్యాచ్ చేస్తాడా.. ఇంకా బాగా చేస్తాడా అన్నదే చూడాలి.

‘అర్జున్ రెడ్డి’ పాత్రలో ఇంకెవరూ ఫిట్ కాలేరు అనుకుంటే.. విజయ్ దేవరకొండకు దీటుగా కనిపించాడు షాహిద్ ‘కబీర్ సింగ్’లో. ‘జెర్సీ’ రూపంలో మరోసారి మంచి కథ, పాత్ర దొరికిన నేపథ్యంలో షాహిద్ మరోసారి రెచ్చిపోవడం ఖాయం అని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English