‘శక్తి’ సినిమా వద్దే వద్దన్న రజనీకాంత్

‘శక్తి’ సినిమా వద్దే వద్దన్న రజనీకాంత్

శక్తి.. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటి. ఆ సమయానికి తెలుగులో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిదే. దానిపై అప్పట్లో మామూలుగా హైప్ లేదు. మొత్తం రికార్డులన్నీ తిరగరాసేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అత్యధిక నష్టాలతో రికార్డుల్ని బద్దలు కొట్టిందా సినిమా. ఎన్టీఆర్ కెరీర్‌కు. వైజయంతీ మూవీస్ బేనర్‌కు ఒక మచ్చలా నిలిచిన చిత్రమది.

ఈ సినిమాతో వైజయంతీ సంస్థ పునాదులే కదిలిపోయే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ దెబ్బ నుంచి అశ్వినీదత్ కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఐతే ఈ చిత్రం చేయడం మంచిది కాదని అశ్వినీదత్‌ను ఓ వ్యక్తి ముందే హెచ్చరించాడట. ఆయన మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్.

‘శక్తి’ సినిమా కథ పూర్తిగా తెలియకుండానే ఈ సినిమా చేయొద్దని చెప్పాడట రజనీకాంత్. ఈ సినిమా స్క్రిప్టు విన్నాక తనకు మంచి మిత్రుడైన రజనీతో ఫలానా సినిమా చేస్తన్నా అని చెప్పానని.. ఐతే శక్తి పీఠాలనేవి చాలా శక్తిమంతమైనవని.. వాటి మీద సినిమా తీయడం మంచిది కాదని రజనీ దత్‌కు సలహా ఇచ్చాడట. ఐతే తాను అదేమీ పట్టించుకోకుండా సినిమా తీశానని, ఫలితం తెలిసిందే అని దత్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐతే శక్తి పీఠాల మీద సినిమా తీయడం వల్ల సినిమా పోయిందని తాను అనుకోవడం లేదని దత్ అభిప్రాయపడ్డాడు.

యండమూరి వీరేంద్ర నాథ్ సహా కొందరు పేరున్న రచయితలు కలిసి రూపొందించిన కథతో మెహర్ రమేష్ తీసిన ‘శక్తి’ తొలి షోతోనే డిజాస్టర్ అని తేలిపోయింది. అప్పట్లోనే దాదాపు రూ.50 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీస్తే.. అందులో 80 శాతం దాకా నష్టాలు వచ్చినట్లు అంచనా.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English