పూజ హెగ్డే తప్పు మీద తప్పు

పూజ హెగ్డే తప్పు మీద తప్పు

మన ఇష్టం ఎక్కడ అయినా వుండొచ్చు కానీ మనం ఎవరికి ఇష్టమనేది గుర్తించి అక్కడ రాణించడంపైన ఎవరైనా దృష్టి పెట్టాలి. కానీ పూజ హెగ్డే మాత్రం ఎలాగయినా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని చూస్తూ అనవసరంగా తెలుగు సినిమాలు పోగొట్టుకుంటోంది. ఆమె కనుక హౌస్‌ఫుల్‌ 4 చేయనట్టయితే తెలుగులో మరో రెండు పెద్ద సినిమాల్లో నటించి వుండేది.

కానీ ఆ చిత్రంలో ఛాన్స్‌ కోసమని ఇక్కడి అవకాశాలని వేరే హీరోయిన్ల పాలు చేసుకుంది. తీరా చూస్తే హౌస్‌ఫుల్‌ 4లో తనని సైడ్‌ హీరోయిన్‌ని చేసారు. క్రితి సనన్‌కి వున్నంత ఇంపార్టెన్స్‌ తనకి లేదు. కేవలం గ్లామర్‌ కోసమే పూజ అందులో పనికొచ్చింది. అందుకోసమని ఆమె ఆ చిత్రానికి అన్ని రోజులు కేటాయించడమే కాకుండా పబ్లిసిటీ కోసం అదనంగా నెల రోజులు ఇచ్చింది.

సినిమా చూసిన వారు ఆమె గురించి అసలేమీ మాట్లాడుకోవడం లేదు. క్రితి కర్బందాకి ఎంత ఇంపార్టెన్స్‌ ఇచ్చారో పూజకి కూడా అంతే ఇస్తున్నారు. తెలుగునాట పదిహేను రోజుల పనికి కోటిన్నర పారితోషికం తీసుకునే లెవల్‌ ఆమెది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ భోగాలతో పాటు తన టీమ్‌కి అదనంగా పాతిక లక్షల వరకు చెల్లిస్తుంటారు. ఇంతగా నెత్తి మీద పెట్టుకుంటున్నా కానీ పూజ తెలుగు చిత్ర సీమకి తగినంత సమయం కేటాయించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English