బాలీవుడ్ క‌ల‌లు భ‌గ్నం

బాలీవుడ్ క‌ల‌లు భ‌గ్నం

సౌత్ సినిమాల్లో ఎంత పేరు సంపాదించినా.. ఏ రేంజికి వెళ్లినా.. చాలామంది హీరోయిన్ల‌కు బాలీవుడ్ సినిమాల్లో వెలిగిపోవాల‌ని ఆశ ఉంటుంది. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ఫెయిల్యూర్ల‌ను ప‌ట్టించుకోకుండా మ‌ళ్లీ అటు వైపు చూస్తుంటారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో తెలుగులో పెద్ద రేంజికి వెళ్లిన పూజా హెగ్డే కూడా ఈ కోవ‌కే చెందుతుంది.

ముకుంద‌, ఒక లైలా కోసం సినిమాలు ఫెయిలైన‌ప్ప‌టికీ ఆమెకు తెలుగులో మంచి పేరే వ‌చ్చింది. అవ‌కాశాలకు లోటు లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఇక్క‌డి ఛాన్సులు వ‌దులుకుని మొహెంజదారో మూవీ కోసం రెండేళ్ల విలువైన కాలాన్ని అంకితం చేసిందామె. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయి పూజ‌కు నిరాశ‌ను మిగిల్చింది.

అలాంటి స్థితిలో టాలీవుడ్డే పూజ‌ను ఆదుకుంది. దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాతో ఆమె కెరీర్ మారిపోయింది. ఇక్క‌డ స్టార్ స్టేట‌స్ సంపాదించింది. వ‌రుస‌గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయినా ఆమెకు సంతృప్తి లేదు. హిందీలో హౌస్ ఫుల్-4 సినిమా చేసింది. ఈ సినిమాను తెగ ప్ర‌మోట్ చేసింది. ఈ చిత్రంతో అయినా బాలీవుడ్లో ఆమె రాత మారుతుంద‌నుకుంటే అదేమీ జ‌ర‌గ‌లేదు.

ఈ సినిమా మ‌రో డిజాస్ట‌ర్‌గా తేలింది. పూజ పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ కూలిపోయాయి. కెరీర్లో ఇంత‌వ‌ర‌కు ఏ సినిమాలో లేనంతగా గ్లామ‌ర్ విందు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. వ‌రుస‌గా రెండు పెద్ద డిజాస్ట‌ర్లు ఖాతాలో వేసుకోవ‌డంతో ఇక పూజా బాలీవుడ్ క‌ల‌ల‌కు పూర్తిగా బ్రేక్ ప‌డ్డ‌ట్లే. ఇక ఆమె చక్క‌గా తెలుగు సినిమాలపై దృష్టిపెడితే ఇంకా పెద్ద రేంజికి వెళ్లొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English