రామ్ చ‌ర‌ణ్ దానిపై క‌న్నేశాడా?

రామ్ చ‌ర‌ణ్ దానిపై క‌న్నేశాడా?

ఒక భాష‌లో ఓ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌గానే.. వేరే భాష‌ల నుంచి ఆరాలు మొద‌లైపోతాయి. రీమేక్ హ‌క్కుల కోసం పోటీ మొద‌ల‌వుతుంది. ఇప్పుడు ఓ త‌మిళ సినిమాపై ఇత‌ర భాష‌ల వాళ్ల క‌ళ్లు అలాగే ప‌డ్డ‌ట్లు చెబుతున్నారు. ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ధ‌నుష్ సినిమా అసుర‌న్ త‌మిళంలో పెద్ద విజ‌యం సాధించింది.

రూ.100 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో ధ‌నుష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. కేవ‌లం వ‌సూళ్లు సాధించ‌డం కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుని క‌ల్ట్ మూవీ అనిపించుకుంది అసుర‌న్. ధ‌నుష్ న‌ట‌న‌కు, వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వానికి ఎన్నో అవార్డులు కూడా రావ‌డం ఖాయం అంటున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రంగ‌స్థ‌లం సినిమాలో ప‌ల్లెటూరి యువ‌కుడిగా అద్భుత అభిన‌యంతో త‌న‌పై ఉన్న అభిప్రాయాల్నే మార్చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. న‌టుడిగా అత‌డికి గొప్ప పేరు తెచ్చిందా చిత్రం. అసుర‌న్ కూడా రూర‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే రా, ఇంటెన్స్ స్టోరీనే.

రంగ‌స్థ‌లంతో పోలిస్తే ఇది చాలా వ‌యెలెంట్‌గా ఉంటుంది. న‌టుడిగా ప్ర‌తిభ చాటుకోవ‌డానికి ఇందులోని లీడ్ క్యారెక్ట‌ర్ చాలా స్కోప్ ఇస్తుంది. ఈ సినిమా చేస్తే రంగ‌స్థ‌లంకి ఎక్స్‌టెన్ష‌న్‌లాగా ఉంటుంద‌ని రామ్ చ‌ర‌ణ్ అనుకుంటున్నాడ‌ట‌. ఇప్పుడు హ‌క్కులు కొని పెట్టుకుని ఆర్ ఆర్ ఆర్ పూర్త‌య్యాక ఈ సినిమా చేయాల‌ని చ‌ర‌ణ్ చూస్తున్నాడ‌ట‌. ఈ సినిమాను పొగుడుతూ మ‌హేష్ బాబు ట్వీట్ వేయ‌డం.. కొంద‌రు పీఆర్వోలు, సినీ ప్ర‌ముఖులు ఈ సినిమా గురించి ఇప్పుడు వ‌రుస‌గా మాట్లాడుతుండ‌టంతో తెలుగు రీమేక్ ప‌క్కాగా ఉంటుంద‌నే ఊహాగానాలు న‌డుస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English