ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్.. రీమేక్ అంటున్నాడే

ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్.. రీమేక్ అంటున్నాడే

గ‌త కొన్నేళ్ల‌లో తెలుగులో వ‌చ్చిన అత్యంత స‌హ‌జ‌మైన‌, నేటివిటీ ఉన్న సినిమా ఏదంటే మ‌రో మాట లేకుండా కేరాఫ్ కంచెర‌పాలెం పేరు చెప్పేయొచ్చు. ఇంత ఒరిజినాలిటీతో తెలుగులో ఓ సినిమా వ‌చ్చి చాలా కాలం అయింది. విశాఖ‌ప‌ట్నం శివార్ల‌లోని కంచ‌ర‌పాలెం అనే ఊరికే వెళ్లి అక్క‌డి మ‌నుషుల్ని ప‌రిశీలించి.. వాళ్ల‌లో ఒక‌డిగా కొన్ని నెల‌ల పాటు బ‌తికి.. అక్క‌డి మ‌నుషుల్నే న‌టులుగా పెట్టుకుని అద్భుత‌మైన సినిమా తీశాడు కొత్త ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా.

చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడి మ‌న‌సు త‌ట్టిన ఈ చిత్రం గొప్ప ప్ర‌శంస‌లందుకుంది.  త‌క్కువ బ‌డ్జెట్లో, ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చి ఈ సినిమా తీసి మెప్పించిన వెంక‌టేష్‌.. త‌న‌కింత గుర్తింపు వ‌చ్చాక ఎలాంటి సినిమా తీస్తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐతే తొలి సినిమాలో అంత ఒరిజినాలిటీ చూపించిన వెంక‌టేష్ ఈసారి రీమేక్ మూవీ ట్రై చేస్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. మ‌ల‌యాళంలో మూడేళ్ల కింద‌ట విడుద‌లై మంచి విజ‌యం సాధించిన మ‌హేషింటె ప్ర‌తీకారం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడ‌ట‌.

ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా దిలీష్ పోత‌న్ రూపొందించిన ఈ చిత్రం మ‌ల‌యాళంలో క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. దీన్ని త‌మిళంలో నిమిర్ పేరుతో ఉద‌య‌నిధి స్టాలిన్ హీరోగా ప్రియ‌ద‌ర్శ‌న్ రీమేక్ చేయ‌డం విశేషం. ఇప్పుడీ చిత్రాన్ని స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో వెంక‌టేష్ రీమేక్ చేస్తున్నాడ‌ట‌. చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కావ‌చ్చింద‌ని.. త్వ‌ర‌లోనే సినిమా విశేషాలు పంచుకుంటార‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English