కంగ‌నా న్యూడ్‌గా న‌టించ‌బోతోందా?

కంగ‌నా న్యూడ్‌గా న‌టించ‌బోతోందా?

క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత విజ‌యం సాధించ‌క‌పోయినా.. కంటెంట్ ప‌రంగా ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక సెన్సేష‌న్‌గా నిలిచిన త‌మిళ‌ చిత్రం ఆడై. దీన్ని తెలుగులో ఆమెగా అనువ‌దించారు. అమ‌లాపాల్ ఈ చిత్రంలో కోసం ఏ ద‌క్షిణాది క‌థానాయికా చేయ‌ని సాహ‌సం చేసింది. సినిమాలో ఒక గంట పాటు న్యూడ్‌గా క‌నిపించింది. ఆమెను పూర్తి న‌గ్నంగా చూపించ‌కుండా క‌వ‌ర్ చేసిన‌ప్ప‌టికీ.. న‌గ్నంగా ఉన్న భావ‌న ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది.

చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను న‌గ్నంగా ఉన్న‌ట్లు కూడా అమ‌లా వెల్ల‌డించింది. ఒక ద‌క్షిణాది క‌థానాయిక ఇలాంటి పాత్ర చేయ‌డం సంచ‌న‌ల‌మే. ఈ సినిమా కాన్సెప్ట్ ప‌రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. కానీ సినిమా అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.

ఐతే ఈ చిత్రం ఇప్పుడు స‌రైన చోటికి వెళ్తోంది. దీన్ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారు. హిందీలో థ్రిల్ల‌ర్లు, రొమాంటిక్ సినిమాల‌కు పెట్టింది పేరైన విక్ర‌మ్ భ‌ట్ ఆడై రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నాడ‌ట‌. ఈ త‌ర‌హా సాహ‌సోపేత పాత్ర‌లు చేయ‌డానికి హిందీలో చాలామంది హీరోయిన్లు రెడీగా ఉంటారు. అయితే బోల్డ్‌గా న‌టించ‌డ‌మే కాదు.. పెర్ఫామెన్స్ కూడా కీల‌కం కావ‌డంతో ఈ పాత్ర కోసం కంగ‌నా ర‌నౌత్‌ను తీసుకోవాల‌ని విక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌.

ఐతే ఆమె ఆషామాషీగా ఏ సినిమా ఒప్పుకోదు. దీనికి తోడు మేకింగ్‌లో త‌న జోక్యం ఎక్కువ‌గా ఉంటుంది. విక్ర‌మ్ లాంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఆమెతో అడ్జ‌స్ట్ అవ‌గ‌ల‌డా.. ఇంత‌కీ ఈ సినిమా చేయ‌డానికి కంగ‌నా ఓకే చెబుతుందా అన్న‌ది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English