నిర్మాతలని తిట్టి పోస్తున్న బన్నీ ఫాన్స్‌

నిర్మాతలని తిట్టి పోస్తున్న బన్నీ ఫాన్స్‌

'అల వైకుంఠపురములో' పాటలు చేస్తోన్న సందడి ఎంజాయ్‌ చేస్తూనే వున్నా కానీ 'ఆర్య' కాంబినేషన్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్‌, సుకుమార్‌ అంటే ఆ సినిమా చాలా స్పెషల్‌గా వుంటుందని అది మొదలు కావడం కోసం చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ చిత్రం గురించి అఫీషియల్‌ అప్‌డేట్‌ లేదు.

మైత్రి మూవీ మేకర్స్‌ ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇందులో వారి తప్పేమీ లేదు. అల్లు అర్జున్‌ డిసైడ్‌ చేస్తే కానీ ఏదీ ప్రకటించడానికి లేదు. అయితే అభిమానులకి అది అర్థం కాదు కదా... అందుకే ఈ చిత్రాన్ని ఇంకా అనౌన్స్‌ చేయడం లేదని నిర్మాతలపై మండి పడుతున్నారు.

వాళ్లేదో చిన్న సినిమా తీస్తూ దాని గురించి ప్రమోషన్లు చేస్తోంటే అల్లు అర్జున్‌ అభిమానులు అసలు సినిమాని వదిలేసి ఈ కొసరు సినిమాల పబ్లిసిటీ ఏమిటని గుస్సా అయ్యారు. నవంబర్‌ నెలాఖరుకి అల వైకుంఠపురములో షూటింగ్‌ పూర్తయిపోతుందని అంటున్నారు కానీ ఇంతవరకు అల్లు అర్జున్‌ అయితే సుకుమార్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. దసరాకి ముహూర్తం చేయించాలని సుకుమార్‌ ఎంత ప్రయత్నించినా కానీ ఇప్పుడు మొదలు పెట్టడానికి తొందరేంటని అల్లు అర్జున్‌ కొబ్బరికాయ కొట్టనేలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English