రానాపై రెండొందలు కోట్లు ఇప్పుడు రిస్కే!

రానాపై రెండొందలు కోట్లు ఇప్పుడు రిస్కే!

రానా దగ్గుబాటి సోలోగా ఇంతవరకు భారీ చిత్రమేదీ చేయలేదు. నటుడిగా తన ఇమేజ్‌ని పెంచే సినిమాని సురేష్‌బాబు చాలా కాలంగా ప్లాన్‌ చేస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' చిత్రం చేయడానికి రానా ఎప్పుడో అంగీకరించాడు. రెండు వందల కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా ఫిలిం చేయాలని సంకల్పించారు.

కానీ ఇప్పటి రానా హెల్త్‌ కండిషన్‌ దృష్ట్యా ఈ కాస్టూమ్‌ డ్రామా రిస్క్‌ని డిసైడ్‌ అయ్యారు. రానాకి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ జరగడంతో అతని బాడీ సెన్సిటివ్‌గా వుంటుందని డాక్టర్లు హెచ్చరించారు. కొంత కాలం పాటు ఫిజికల్‌గా స్ట్రెయిన్‌ అయ్యే ఏ పనులు, బాడీ బిల్డింగ్‌తో సహా ఏదీ రానా చేయడానికి వీల్లేదు.

ఇలాంటి సమయంలో గుర్రాలు ఎక్కి, కత్తి యుద్ధాలంటే ఫిజికల్‌గా చాలా స్ట్రెయిన్‌ వుంటుంది కనుక ప్రస్తుతానికి హిరణ్య కశ్యప వాయిదా వేసారు. మూడేళ్లుగా రానా కోసం గుణ శేఖర్‌ ఎదురు చూస్తున్నాడు కానీ మరి కొన్నాళ్లు వేచి వుండక తప్పదు.

అయితే సాంఘిక చిత్రాలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫైట్లు, ఫీట్లు లేని సినిమాలు రానా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. విరాఠపర్వం షూటింగ్‌కి వచ్చే నెల నుంచి రానా హాజరవుతాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English