తమన్నా వల్ల తమ్ముడికి ఎలివేషన్‌

తమన్నా వల్ల తమ్ముడికి ఎలివేషన్‌

'రాజుగారి గది 3' తమన్నా కథానాయికగా మొదలయింది. అయితే ఆ తర్వాత తమన్నా తప్పుకోవడంతో ఓంకార్‌ ఇక స్టార్‌ హీరోయిన్‌ కోసం చూడలేదు. అసలు తమన్నా లాస్ట్‌ మినిట్‌లో ఎందుకు తప్పుకుందంటే... ఓపెనింగ్‌ అయిన తర్వాత తమన్నా కథ మార్చమని చెప్పిందట.

తనకి ముందు చెప్పిన కథకి, తర్వాత చెప్పిన దానికీ తేడా వుందని, మరీ కమర్షియల్‌గా మార్చేసారని అభ్యంతరం చెప్పిందట. అయితే అంత లేట్‌గా మార్పులు చేపడితే షూటింగ్‌ సజావుగా సాగదని తమన్నాని రీప్లేస్‌ చేసారట. ఆమె వెళ్లిపోవడంతో హీరోయిన్‌ ప్రధాన కథని హీరో వైపు మార్చేసాడట. అలా తన తమ్ముడు అశ్విన్‌ని ఎలివేట్‌ చేసుకునే వీలు చిక్కిందని, ఇక అతడి సీన్లు పెంచుకుని తనకి కావాల్సినట్టుగా సినిమా తీసుకున్నానని, తమన్నా చేసి వుంటే ఎలా వుండేదనేది పక్కన పెడితే ఇప్పుడు హీరోగా అశ్విన్‌కి ఈ చిత్రం హెల్ప్‌ అయిందని ఓంకార్‌ అంటున్నాడు.

ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా సేఫ్‌ అవుతుంది కనుక రాజుగారి గది 4 కూడా తమ్ముడితోనే చేస్తానని చెబుతున్నాడు. ఈ ఫ్రాంచైజీని జనం పూర్తిగా తిప్పి కొట్టే వరకు వేరే కథల గురించి ఆలోచించడానికి కూడా ఓంకార్‌కి ఇష్టం లేనట్టుంది. ఈ గది దాటి బయటకి వెళితే ఎక్కడ తన 'జీనియస్‌' లక్షణాలు బయటపడతాయని భయపడుతున్నాడో ఏమో తెలీదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English