సరిలేరు నీకెవ్వరుకి ఆ ఎపిసోడ్‌ చాలు

సరిలేరు నీకెవ్వరుకి ఆ ఎపిసోడ్‌ చాలు

ప్రమోషన్లలో అల వైకుంఠపురములో చిత్రం కదనోత్సాహం చూపిస్తోంటే, సరిలేరు నీకెవ్వరు మాత్రం అలా సైడ్‌కే వుండిపోయింది. ఇంకా విడుదలకి చాలా సమయం వుంది కనుక ఆ చిత్ర నిర్మాతలకి ఎలాంటి టెన్షన్‌ లేదు.

ఎలాగో అనిల్‌ రావిపూడి సినిమాల్లో కామెడీ మాస్‌కి నచ్చుతుంది కనుక, ఇక మహేష్‌లాంటి అగ్ర హీరో వున్నాడు కనుక టెన్షన్‌ దేనికని అనుకుంటున్నారు. దిల్‌ రాజు అయితే ఈ చిత్రం కూడా ఎఫ్‌ 2లా నవ్వులతో అదరగొట్టేస్తుందని నమ్ముతున్నాడు. ఈ చిత్రంలోని ట్రెయిన్‌ ఎపిసోడ్‌ అదిరిపోతుందని ఆయన కనిపించిన వారందరికీ చెబుతున్నాడు.

వెంకీలో ట్రెయిన్‌ సీన్‌ ఎంత ఫన్‌ జనరేట్‌ చేసిందో అంతకు మించిన కామెడీ వుంటుందని, మహేష్‌బాబు కూడా దూకుడు తర్వాత మళ్లీ అంతగా కామెడీ చేసిన చిత్రమిదేనని అంటున్నారు. కేవలం కామెడీనే కాకుండా ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో మంచి యాక్షన్‌ సీన్లు కూడా పడ్డాయట.

కమర్షియల్‌గా ఒక స్టార్‌ హీరో చిత్రం నుంచి ఏమి ఆశిస్తారో అవన్నీ ఇందులో వుంటాయని, పోటీ గురించిన చింత అవసరం లేదని మహేష్‌తో సహా అందరూ యమ ధీమాగా వున్నారట. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English