ప్రభాస్‌ను ఇంకో రౌండ్ ఏసుకుంటున్నారు

ప్రభాస్‌ను ఇంకో రౌండ్ ఏసుకుంటున్నారు

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు ‘బాహుబలి’ సినిమాతో శిఖర స్థాయి ఇమేజ్ వచ్చింది. కానీ దాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘బాహుబలి’కి దీటుగా ఉండాలని అయినకాడికి ‘సాహో’ బడ్జెట్ అయితే పెంచుకుంటూ పోయారు కానీ.. కంటెంట్ మీద అంతగా దృష్టిపెట్టలేదు. ఈ సినిమా అంచనాల్ని అదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. సినిమా బాలేకపోవడం ఒకెత్తయితే.. ఇందులో ప్రభాస్ లుక్ మరీ పేలవంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

విడుదలకు ముందు వచ్చిన ప్రోమోల్లోనే ప్రభాస్ తేడాగా కనిపించాడు. ఓవరాల్‌గా సినిమాలో చూస్తే బాగుంటాడులే అనుకున్నారు. కానీ సినిమాలో మరింత పేలవంగా కనిపించాడు ప్రభాస్. అతడి లుక్ ఏమీ బాగా లేదు. మేకప్ కూడా సరిగా వేయలేదు. కొన్ని సీన్లలో ప్రభాస్ ఎంత ఎబ్బెట్టుగా కనిపించాడంటే.. వెంటనే ఫ్రేమ్ మారిస్తే బాగుణ్నని ప్రేక్షకులకు అనిపించింది.

‘సాహో’ రిలీజైనపుడు ఆ సినిమా ఎలా ఉందనే విషయంతో పాటు ప్రభాస్ లుక్ గురించి కూడా చర్చ జరిగింది. ఐతే ఇప్పుడు ‘సాహో’ అమేజాన్ ప్రైమ్‌లోకి రావడంతో మరోసారి సినిమా చర్చల్లోకి వచ్చింది. మధ్యలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరు లుక్స్, ఇతర విషయాల మీద ప్రభాస్ అభిమానులు విమర్శలు చేయడం.. ‘బాహుబలి’తో పోల్చి ఈ సినిమాను తక్కువ చేయాలని చూడటంతో మెగా అభిమానులకు మంట పుట్టించింది. వాళ్లు ప్రభాస్‌ను టార్గెట్ చేస్తున్నారు కొన్ని రోజులుగా.. ఇలాంటి టైంలో ‘సాహో’ ప్రైమ్‌లోకి వచ్చేసరికి వాళ్లు మరోసారి రెచ్పిపోతున్నారు.

వివిధ సన్నివేశాల్లో ప్రభాస్ లుక్స్‌ను స్క్రీన్ షాట్లుగా తీసి ట్విట్టర్లో షేర్ చేస్తూ సినిమా పరాజయానికి అతి ముఖ్య  కారణాల్లో ప్రభాస్ లుక్‌ కూడా ఒకటని విశ్లేషిస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ అనే కాదు.. న్యూట్రల్‌గా ఉండేవాళ్లకు కూడా ప్రభాస్ లుక్స్ విషయంలో అభ్యంతరాలున్న మాట వాస్తవం. స్వయంగా అభిమానులకే అతడి లుక్ రుచించలేదు. సోషల్ మీడియాలో ఈ నెగెటివిటీ చూశాక అయినా ప్రభాస్ తన తర్వాతి సినిమాలో లుక్ విషయంలో జాగ్రత్త పడకుంటే కష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English